Movie News

విక్రమ్ వారసుడి తప్పటడుగులు

చియాన్ విక్రమ్ కు తమిళ, తెలుగులో పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అందుకే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా తన సినిమా వస్తోందంటే ఏపీ తెలంగాణలో కనీస ఓపెనింగ్స్ ఉంటాయి. ఇక కోలీవుడ్ సంగతి సరేసరి. యావరేజ్ ఉన్నా సరే హిట్టు చేసి పెడతారు. ఇంత ఫాలోయింగ్ ఉన్న విక్రమ్ తన కొడుకు ధృవ్ విషయంలో సరైన ప్లానింగ్ ఇవ్వడం లేదనే కామెంట్స్ ఫ్యాన్స్ మధ్యలో వస్తున్నాయి. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో తెరకు పరిచయమైన ధృవ్ విక్రమ్ డెబ్యూ చేసింది 2020లో. ఆ తర్వాత నాన్న విక్రమ్ తో కలిసి మహాన్ చేశాడు కానీ అది ఓటిటిలో రావడం వల్ల కమర్షియల్ స్టామినా తెలియలేదు.

ఇప్పుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ చేస్తున్నాడు. ఇది ప్యాన్ ఇండియా మూవీనే కానీ చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేయలేదు. ఒకపక్క కార్తీ, సూర్య లాంటి సీనియర్ హీరోలు వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ ఉంటే ధృవ్ మాత్రం ఇలా రెండేళ్లకొకటి చేయడం వల్ల కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడో అర్థం కావడం లేదు. పైగా థగ్ లైఫ్ తో అల్ట్రా డిజాస్టర్ అందుకున్న మణిరత్నంకి ఎస్ చెప్పాడనే టాక్ మరింత ఖంగారు పెట్టేలా ఉంది. ఎందుకంటే శింబు వద్దనుకున్న సబ్జెక్టుని ఇప్పుడు ధృవ్ ఓకే చేశాడనే ప్రచారం చెన్నై వర్గాల్లో ఉంది.

పొన్నియిన్ సెల్వన్ తో డీసెంట్ హిట్ అందుకున్న మణిరత్నం బయట రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఇక థగ్ లైఫ్ సంగతి సరేసరి. ఇలా మేజిక్ టచ్ కోల్పోయిన సీనియర్ డైరెక్టర్ తో చేయడం వల్ల ధృవ్ కి అది ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ లో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి వసంత్ ఇప్పుడీ మూవీలో ధృవ్ జోడిగా ఎంపికైనట్టు తెలిసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మాములే. అయినా కుర్రాళ్ళు ఉడుకు రక్తంతో పరుగులు పెట్టాలి కానీ మీనమేషాలు లెక్కబెట్టుకుంటూ నెమ్మదిగా సినిమాలు చేయడం ఎంత మాత్రం మంచిది కాదు.

This post was last modified on August 5, 2025 9:09 pm

Share

Recent Posts

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

3 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

5 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

6 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

9 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

9 hours ago