ఇండస్ట్రీలోనే కాదు సగటు అభిమానుల్లో తెగ మెదులుతున్న సందేహం సెప్టెంబర్ 25 పవన్ కళ్యాణ్ ఓజితో అఖండ 2 క్లాష్ ఉంటుందా లేదాని. కొందరేమో బాలయ్య డిసెంబర్ కు వెళ్లిపోయారని, ది రాజా సాబ్ వదులుకునే అవకాశమున్న డిసెంబర్ 5 తీసుకుంటారనే ప్రచారం మొదలుపెట్టారు. కానీ దర్శకుడు బోయపాటి శీను గుట్టుచప్పుడు కాకుండా పనులు చక్కబెట్టేస్తున్నారని సమాచారం. బాలకృష్ణ ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తి చేయగా ఇంకో రెండు మూడు రోజుల్లో రెండో సగం అయిపోతుంది. మిగిలిన ఆర్టిస్టుల డేట్లను తీసుకుని వాళ్లకు అనుగుణంగా మొత్తం ఆగస్ట్ మూడో వారంలోపే ఫినిష్ చేయబోతున్నారట.
విఎఫ్ఎక్స్ పనులు కొంచెం ఎక్కువ టైం డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆలస్యం కాకుండా ఉండేలా బోయపాటి శీను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని వినికిడి. ఓటిటి డీల్ ఇంకో రెండు వారాల్లోపే ఫైనల్ కావొచ్చని అంటున్నారు. ఓజి రూపంలో తీవ్రమైన పోటీ కవ్విస్తున్నా సరే వెనక్కు తగ్గే ఆలోచన టీమ్ లో లేదని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. మంచి డేట్ వదులుకుంటే ఇంకో రెండు నెలలు వెయిట్ చేయాల్సి వస్తుందని, దాని వల్ల ఓపెనింగ్స్ మిస్ చేసుకోవడంతో పాటు కొన్ని రిస్కులనైతే భరించాల్సి ఉంటుంది. నిర్మాతలు 14 రీల్స్ అందుకే ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వడం లేదు.
ప్రస్తుతనికి అఖండ 2 ప్రమోషన్లు మళ్ళీ రీ స్టార్ట్ కాలేదు. సంగీత దర్శకుడు తమన్ త్వరలో మొదటి ఆడియో సింగల్ రావొచ్చనే దిశగా సోషల్ మీడియా అభిమానులకు హింట్ ఇస్తున్నాడు. అదే నిజమైన పక్షంలో బాలయ్య ట్రాక్ లో ఉన్నట్టే. ఇంత త్వరగా డబ్బింగ్ చెప్పిస్తున్నారంటే అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం కోసమే అయ్యుంటుంది. ఇప్పటికైతే అఖండ 2 నుంచి ఎలాంటి వాయిదా సంకేతాలు లేవు. ఓజి ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ రిలీజై ఛార్ట్ బస్టర్ కొట్టేసింది. ఇక అఖండ 2 కూడా ఆడియో హంగామా మొదలుపెడితే క్లాష్ కన్ఫర్మ్ అనుకోవచ్చు. ఏదున్నా ఇంకొద్ది రోజుల్లో దీన్ని తేల్చేయాలి.
This post was last modified on August 5, 2025 2:48 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…