Movie News

ట్రైలర్ ‘వార్’…. ఎక్కువ ‘కూలీ’ ఎవరికి

విపరీతమైన అంచనాలు మోస్తూ ఆగస్ట్ 14 ఒకే రోజు విడుదల కాబోతున్న వార్ 2, కూలీ రెండు ట్రైలర్లు వచ్చేశాయి. అంచనాల పరంగా రజనీకాంత్ పై చేయి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ట్రైలర్ వచ్చాక లెక్కలు మారిపోయాయి. ఆశించిన స్థాయిలో లోకేష్ కనగరాజ్ కోరుకున్న హై ఇవ్వలేకపోయాడని కొందరు కామెంట్ చేస్తుండగా, కావాలని స్టోరీ అర్థం కాకుండా అండర్ ప్లేతో అలా కట్ చేయించారని మరికొందరు అంటున్నారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు డీ కోడింగ్ చేసుకుని సోషల్ మీడియా లో కథలు కూడా అల్లేశారు. ఇక వార్ 2 యాక్షన్ విజువల్స్ పరంగా సంతృప్తి పరిచినా ఇంకేదో మిస్సయిన ఫీలింగ్ కలిగించింది.

చెప్పాలంటే క్రికెట్ మ్యాచ్ లో సమాన పరుగులతో రెండు జట్ల మధ్య టై అయినట్టు వార్ 2, కూలి ట్రైలర్ రెండూ రెండు త్రాసుల వైపు బ్యాలన్స్ గా ఉన్నాయి. యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ కోణంలో చూస్తే కూలి చాలా ఎత్తులో ఉండగా రాబోయే రోజుల్లో చేయబోయే ప్రమోషన్లతో వార్ 2 కూడా ఊపందుకుంటుందని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ రెండు టీముల చేతిలో ఇంకో  బాధ్యత ఉంది. రిలీజ్ కు రెండు మూడు రోజుల ముందు ఇంకో ఫ్రెష్ ట్రైలర్ ని వదలడం ద్వారా అంచనాల లెక్కలను మార్చుకోవచ్చు. కానీ చేస్తారా చేయరా అనేది అనుమానంగానే ఉంది. ముఖ్యంగా కూలీ.

ఇది పక్కనపెడితే ఇంకో తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల పరంగా దూసుకెళ్లాల్సిన టైం అయితే వచ్చింది. ఇప్పటిదాకా వార్ 2 వైపు  నుంచి పెద్దగా సౌండ్ లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 10 జరిగే అవకాశాలున్నాయి కానీ వేదిక ఏదనేది ఇంకా నిర్ధారణ కాలేదు. పేరుకి హిందీ డబ్బింగ్ అయినప్పటికీ స్ట్రెయిట్ మూవీ రేంజ్ లో వార్ 2ని విడుదల చేస్తుండగా, కూలి సైతం నేనేం తీసిపోలేదనే తరహాలో హడావిడి చేస్తోంది. ఎవరిది పైచేయి అవుతుందో, ఎవరు విజేతగా నిలుస్తారో లేక సమంగా కప్పు పంచుకుంటారో వేచి చూడాలి.

This post was last modified on August 5, 2025 12:41 pm

Share

Recent Posts

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

27 minutes ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

3 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

6 hours ago

అంబానీయే ఇండియాకు బాసా?

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…

10 hours ago

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

11 hours ago