సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్ భామ.. మృణాల్ ఠాకూర్. ఐతే గత ఐదారేళ్లలో ఈ రెండూ తప్పితే ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. ముఖ్యంగా తాను కథానాయికగా ఎదిగిన బాలీవుడ్లో ఆమెకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2019లో హృతిక్ రోషన్ మూవీ ‘సూపర్ 30’తో బ్రేక్ అందుకున్న మృణాల్.. ఆ తర్వాత బాలీవుడ్లో ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయింది. బాట్లా హౌస్, తూఫాన్, జెర్సీ, సెల్ఫీ, గుమ్రా, ఆంఖ్ మిచోలి, పిప్పా… ఇలా వరుసగా పరాజయాలు ఎదుర్కొంది.
తాజాగా మృణాల్ ఖాతాలో మరో డిజాస్టర్ జమ అయింది. అదే.. సన్నాఫ్ సర్దార్-2. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోవడం వల్ల ఈ సినిమాకు ఓపెనింగ్స్ కరవయ్యాయి. 50 పర్సంట్ ఆఫర్ పెట్టినా కూడా తొలి రోజు థియేటర్లలో జనం కనిపించలేదు. దీనికి తోడు సినిమాకు డివైడ్ టాక్ రావడంతో వీకెండ్లో కూడా సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించలేకపోయింది. వీక్ డేస్ వచ్చేసరికి థియేటర్లు ఖాళీ అయిపోయాయి. చాలా త్వరగా సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. తన సొంత ఇండస్ట్రీలో ఓ హిట్ కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న మృణాల్‌కు మరోసారి నిరాశ తప్పలేదు.
తెలుగులోనూ చివరగా మృణాల్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్ అయింది. దీంతో ఇక్కడ కూడా ఆమె కెరీర్ కొంచెం స్లో అయింది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ అడివి శేష్‌కు జోడీగా నటిస్తున్న ‘డెకాయిట్’ మూవీ మీదే ఉన్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడని పేరున్న శేష్.. ఆమెకు ఓ హిట్ ఇస్తాడనే ఆశలున్నాయి. హిందీలో ఆమె చేతిలో మరో మూవీ సినిమాలున్నాయి. మరోవైపు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఆమె నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
This post was last modified on August 5, 2025 11:26 am
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…