తెలుగు సినిమాకు సంక్రాంతి, దసరా ఎలాగయితే బిజినెస్ పరంగా కీలకమో… బాలీవుడ్‍లోను అలా కొన్ని పర్టిక్యులర్ డేట్స్ వున్నాయి. వాటిలో ఒకటి ఇండిపెండెన్స్ డే వీకెండ్. అందుకే ఈద్, దివాళీతో పాటు ఇండిపెండెన్స్ వీకెండ్ రిలీజ్‍పై స్టార్లు కర్చీఫ్ వేస్తుంటారు. సాహో చిత్రానికి ఇండిపెండెన్స్ డే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నపుడు పలు హిందీ సినిమాలు పోటీకి వచ్చాయి. అయితే సాహో ఆ టైమ్‍లో రిలీజ్ కాలేక రెండు వారాల పాటు వాయిదా పడింది.
తాజాగా ఆదిపురుష్ చిత్రానికి 2022 ఆగస్టు 11 రిలీజ్ డేట్ ఖాయం చేసారు. ఇంకా మొదలు కూడా కాని సినిమాకు అప్పుడే రిలీజ్ డేట్ ఎందుకంటే… బాలీవుడ్‍లో అలాగే ప్లాన్ చేసుకుంటారు. ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని అందుకు తగ్గట్టుగా వర్క్ ప్లాన్ చేస్తారు. అయితే ఆగస్టు 11 డేట్‍కి ప్రభాస్ సినిమా విడుదల చేస్తే ఇతర బాలీవుడ్ స్టార్లు ఆ వీకెండ్‍ని ప్రభాస్‍కి వదిలేస్తారా? అతడితో పోటీకి వెళ్లకుండా వుంటారా అంటే ఇప్పుడే చెప్పడం కష్టం.
సల్మాన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్లు పండుగ సీజన్లు హైజాక్ చేసేస్తారు కనుక అక్షయ్‍కుమార్, అజయ్ దేవ్‍గన్‍లాంటి వాళ్లు ప్రభాస్‍కి ఇలాంటి కీ డేట్ ఫ్రీగా ఇచ్చేసే పరిస్థితి వుండకపోవచ్చు.
This post was last modified on November 19, 2020 7:11 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…