ఇటీవలే రీ రిలీజైన రాంఝాన (తమిళ డబ్బింగ్ అంబికాపతి) క్లైమాక్స్ లో చనిపోయిన తన పాత్రను మళ్ళీ బ్రతికినట్టు ఏఐ ద్వారా మార్చేయడం ధనుష్ ని తీవ్రంగా కలవరపరిచింది. 12 సంవత్సరాల క్రితం తాను ఒప్పుకున్న సినిమా ఇది కాదని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఇలా చేయడం తప్పని చెబుతూ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా కఠిన నిబంధనలు తీసుకు రావాల్సిన అవసరం చాలా ఉందని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ప్రత్యేక నోట్ లో పేర్కొన్నాడు. వినడానికి ఇదో చిన్న విషయంగా ఇప్పటికి కనిపిస్తున్నా భవిష్యత్తులో దీని పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయి.
రీ రిలీజ్ క్రేజ్ ఉందనే సాకుతో ఇలా ఇష్టం వచ్చినట్టు క్లైమాక్సులు, ముఖ్యమైన ఎపిసోడ్లను మార్చుకుంటూ పోతే క్రియేటివిటీ పక్కదారి పట్టడం ఖాయం. ఫ్యాన్స్ ఎమోషన్స్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఇలాంటి ప్రయోగాలు చేయడం బిజినెస్ కోణంలో వాళ్లకు రైట్ అనిపించవచ్చు. కానీ ఒరిజినాలిటీ దెబ్బ తిన్నాక దాని తాలూకు ప్రభావం తర్వాత జనరేషన్ల మీద పడుతుంది. ఉదాహరణకు ఇప్పుడు అంబికాపతి చూస్తున్న ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు ధనుష్ బ్రతికి ఉండటమే అసలు క్లైమాక్స్ అనుకుంటాడు. దీని వల్ల చనిపోయినప్పుడు పండాల్సిన ఎమోషన్ అతని కోణంలో జీరో అయిపోతుంది.
ధనుష్ భయపడుతున్న రిస్క్ ఇదే. ఇవాళ సభాపతికి చేశారు. రేపు ఇంకొకరికి చేయరనే గ్యారెంటీ లేదు. పెదరాయుడులో రజనీకాంత్ ని తిరిగి బ్రతికిస్తే ఏమవుతుంది. వినడానికి నవ్వొస్తుంది కానీ ఆ కోణంలో ఎవరైనా ఆలోచించి దానికి తెగబడితే దానికున్న క్లాసిక్ స్టేటస్ కి మచ్చ పడుతుంది. ఓ రెండు వేలు ఖర్చు పెడితే చనిపోయిన వాళ్ళను ఏఐలో సృష్టించి వాళ్ళ బంధువులు, పిల్లల పెళ్లిలలో వీడియోల ద్వారా డబ్బులు సంపాదిస్తున్న సంస్థలు పెరిగిపోతున్నాయి. అలాంటిది కోట్ల రూపాయలు పెడుతున్న నిర్మాతలు కనక టెంప్ట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు ఏఐ వాడితే అనవసరమైన రచ్చకు కారణం అవుతారు.
This post was last modified on August 4, 2025 10:39 pm
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…