నిన్న విడుదలైన ఓజి మొదటి లిరికల్ సాంగ్ కి అభిమానులు ఊగిపోతున్నారు. తెలుగు, ఇంగ్లీష్, జపాన్ బాషలను కలగలిపి రాయించిన వెరైటీ లిరిక్స్ కి తమన్ కంపోజ్ చేసిన అల్ట్రా ఫాస్ట్ బీట్స్ ఓ రేంజ్ లో కిక్ ఇస్తున్నాయి. వ్యూస్ పరంగా అప్పుడే రికార్డుల వేట మొదలైపోయింది. ముందు నుంచి ఈ ప్రాజెక్టు మీద విపరీతమైన అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ కోణంలో చూసుకుంటే దర్శకుడు సుజిత్ వాళ్ళ మనసులను గెలిచేసుకున్నాడు. యానిమేషన్ షాట్, రియల్ సీన్లు రెండు కలగలిపి గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ చేయబోయే విధ్వంసాన్ని శాంపిల్స్ రూపంలో చూపించడం బాగా వర్కౌట్ అయ్యింది.
ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుకోవాలి. ఓజి సాంగ్ ఛార్ట్ బస్టర్ అనిపిస్తోంది కానీ సాధారణ ప్రేక్షకులకు అంత వేగంగా ఎక్కుతోందా అంటే వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సోషల్ మీడియా రెస్పాన్స్ మిశ్రమంగా కనిపిస్తోంది. టైటిల్ సాంగ్స్ కంపోజ్ చేయడంతో దేవిశ్రీ ప్రసాద్ ది ప్రత్యేక శైలి. గబ్బర్ సింగ్, శంకర్ దాదా ఎంబిబిఎస్, పుష్ప లాంటి వాటికి ఇచ్చిన పాటలు ఎక్కువ కాలం నిలిచిపోయాయి. కానీ తమన్ కొంచెం ఈ విషయంలో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అప్పటికప్పుడు ఎక్కినా తర్వాత వాటి లైఫ్ మీద డౌట్లు వచ్చేలా రీచ్ హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది.
ఓజి గురించి ఇంత డిస్కషన్ కు కారణముంది. కొన్ని నెలల నుంచి తమన్ చాలా ఇంటర్వ్యూలలో ఓజి గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తూ వచ్చాడు. ఇప్పటికదాకా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బెస్ట్ ఆల్బమ్ అవుతుందనే రేంజ్ లో హైప్ పెంచేశాడు. వాటిని నిలబెట్టుకునేలా ప్రతి పాట ఉండాల్సిందే. సరే మూడు బాషల ప్రయోగం కాబట్టి టైటిల్ ట్రాక్ ఎక్కడానికి కొంచెం పడుతుంది అనుకున్నా ఇకపై రాబోయేవి మాత్రం అంచనాలకు మించి ఉంటేనే పనవుతుంది. రిలీజ్ డేట్ కి ఇంకో యాభై రెండు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇకపై ప్రతి అడుగు హై వోల్టేజ్ తో పడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates