ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూనే తిరుగుతోంది. అది ప్రవేశించని రంగం లేదు. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నట్లుగా దాని సాయంతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. సినీ రంగంలోనూ ఏఐ వాడకం పెరుగుతోంది. మున్ముందు సినిమాల మేకింగ్‌లో ఏఐ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతి టెక్నీషియన్ దీన్ని వాడుకునేలా కనిపిస్తున్నారు. సంగీతంలో కూడా ఏఐ పాత్ర కీలకం కాబోతోందనడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి.
ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన అనిరుధ్ రవిచందర్.. ఇప్పటికే పాటల కోసం చాట్ జీపీటీని వాడడం మొదలుపెట్టేశాడట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో అతను ఓపెన్‌గా చెప్పేశాడు. చాట్ జీపీటీలో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుని.. పాటల్లో దాని సాయం తీసుకుంటున్నట్లు అతను వెల్లడించాడు.
ఒక పాట కంపోజ్ చేస్తుండగా.. చివరి రెండు లైన్ల దగ్గర తాను స్ట్రక్ అయిపోయినట్లు అనిరుధ్ తెలిపాడు. మిగతా పాట అంతా అయిపోయినా.. ఆ రెండు లైన్ల విషయంలో కొత్త ఐడియాలేమీ రాలేదని.. దీంతో చాట్ జీపీటీని ఆశ్రయించానని అనిరుధ్ తెలిపాడు. ముందు రెడీ అయిన లైన్లన్నింటినీ అందులో పోస్ట్ చేసి, సజెషన్స్ ఇచ్చి మిగతా రెండు లైన్ల కోసం ఐడియా అడిగితే.. అది చాలా ఆప్షన్లు ఇచ్చిందని అనిరుధ్ తెలిపాడు.
ఐతే అతను చాట్ జీపీటీని అడిగింది లిరిక్స్ కోసమా.. ట్యూన్ కోసమా అన్నది స్పష్టంగా చెప్పలేదు. అతను అడిగింది ఏదైనప్పటికీ.. ఇలాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ చాట్ జీపీటీ సాయంతో సాంగ్స్ చేస్తున్నాడా అని సోషల్ మీడియా జనాలు ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్తులో సాంగ్స్ కంపోజింగ్ ఎలా ఉండబోతోందో.. ఏఐ అందులో ఎలాంటి పాత్ర పోషించబోతోందో చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. కాస్త సంగీత జ్ఞానం ఉన్న వాళ్లు దీని సాయంతో ఈజీగానే పాటలు కంపోజ్ చేసేస్తారేమో.
This post was last modified on August 3, 2025 9:56 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…