టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ.. సోషల్ మీడియాలో ఎంత పాపులరో తెలిసిందే. ఆయన ఏదైనా ఈవెంట్లో పాల్గొన్నా.. ప్రెస్‌మీట్‌కు హాజరైనా.. ఇంటర్వ్యూ ఇచ్చినా.. తన కామెంట్లతో వార్తల్లో వ్యక్తి అయిపోతుంటారు. చాలా ఓపెన్‌గా మాట్లాడే క్రమంలో ఆయన చేసే కామెంట్లు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతుంటాయి. ఇటీవల ‘కింగ్డమ్’ సినిమా సక్సెస్ మీట్లో నాగవంశీ ఇలాగే యథాలాపంగా చేసిన కామెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్టయ్యారు.
‘కింగ్డమ్’ సక్సెస్ మీట్ ఏపీలో నిర్వహించాలనుకుంటున్నట్లు నాగవంశీ చెప్పగా.. ఆ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌కు అతిథిగా పిలుస్తారా అని ఒక విలేకరి అడిగాడు. దానికాయన బదులిస్తూ.. ప్రస్తుతం తమకు విజయే పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించారు. దీని మీద పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోయారు. పవన్ కళ్యాణ్‌ను డీగ్రేడ్ చేసి మాట్లాడాడంటూ సోషల్ మీడియాలో.. నాగవంశీ మీద యుద్ధం ప్రకటించేశారు.
ఐతే తాజాగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగవంశీ ఈ వివాదం మీద స్పందించారు. తాను పవన్ కళ్యాణ్‌ను డీగ్రేడ్ చేయడం ఏంటి అని ఆయన ఆశ్చర్యపోయారు. సినిమాలకు సంబంధించి కొన్ని విషయాల్లో కొందరిని రెఫరెన్సుగా తీసుకుంటామని.. ఎవరైనా అందంగా ఉన్నారని చెప్పడానికి హృతిక్ రోషన్‌లా ఉన్నాడు అని కామెంట్ చేస్తామని.. అలాగే తెలుగులో హీరో అంటే పవన్ కళ్యాణే అనే అభిప్రాయం ఉందని.. తాను కూడా ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఒక రెఫరెన్స్ అన్నట్లుగా.. తమకు విజయ్ దేవరకొండనే పవన్ కళ్యాణ్ అనే అర్థంలో మాట్లాడానని నాగవంశీ వివరించాడు.
నిజానికి తాను పవన్ కళ్యాణ్‌కు ఎలివేషన్ ఇచ్చానని.. ఇలాంటి కామెంట్‌ను కూడా కాంట్రవర్శీగా మారిస్తే తాను ఏం చేయలేనని నాగవంశీ వ్యాఖ్యానించాడు. నిజానికి కొందరు పవన్ ఫ్యాన్స్.. నాగవంశీ కామెంట్లను పాజిటివ్‌గానే తీసుకున్నారు. అది ఎలివేషనే తప్ప.. డీగ్రేడ్ చేయడం కాదని కో ఫ్యాన్స్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా కొందరు నాగవంశీ మీద పడిపోయారు.
This post was last modified on August 2, 2025 4:48 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…