71 జాతీయ అవార్డుల పురస్కారాల్లో టాలీవుడ్ జెండా ఎగిరింది. వివిధ విభాగాల్లో మన సినిమాలు పురస్కారాలు అందుకున్నాయి. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ అవార్డు దక్కించుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏవిజిసి (యానిమేషన్ – విజువల్ ఎఫెక్ట్స్ – గేమింగ్ అండ్ కామిక్) విభాగంలో ‘హనుమాన్’ సత్తా చాటింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, గ్రాఫిక్స్ సూపర్ వైజర్ జెట్టి వెంకట్ కుమార్, నిర్మాత నిరంజన్ రెడ్డికు దీన్ని అందజేయబోతున్నారు. ఉత్తమ నేపధ్య గాయకుడిగా ‘బేబీ’లో ప్రేమిస్తున్నా పాటకు పివిఎస్ఎస్ రోహిత్ అవార్డు గెలుచుకోవడం విశేషం.
ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ క్యాటగిరీలో ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ తన ముద్ర చూపించారు. గతంలో కలర్ ఫోటో నిర్మాతగా సాయి రాజేష్ ఇదే వేదిక మీద అవార్డు తీసుకోవడం మూవీ లవర్స్ మర్చిపోలేదు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి డెబ్యూతోనే ఈ ఘనత సాధించడం విశేషం. ‘గాంధీ తాత చెట్టు’ కమర్షియల్ గా విజయం సాధించకపోయినా ప్రయత్న పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగువాడైన హర్షవర్ధన్ రామేశ్వర్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ‘యానిమల్’ మూవీకి గుర్తింపు దక్కింది. ఆ సినిమాకిచ్చిన అద్భుతమైన స్కోర్ కు అతను ఖచ్చితంగా అర్హుడే.
‘బలగం’లో పాటకు గాను గీత రచయిత కాసర్ల శ్యామ్ కు జాతీయ అవార్డు వచ్చింది. గతంలో ఈ గౌరవాన్ని అందుకున్న వేటూరి (మాతృదేవోభవ), సుద్దాల అశోక్ తేజ (ఠాగూర్) లాంటి దిగ్గజాల సరసన కాసర్ల శ్యామ్ నిలవడం విశేషం. లిరిక్ రైటర్ గా కెరీర్ మంచి ఊపందుకుంటున్న టైంలో ఇది జరగడం తనకు మంచి బూస్ట్ అవుతుంది. మొత్తానికి తెలుగు సౌరభాలు ఈసారి గట్టిగానే వెల్లివిరిశాయి. హాయ్ నాన్న, విరూపాక్ష లాంటి సినిమాలకు రావొచ్చని భావించిన మూవీ లవర్స్ కోరిక నెరవేరలేదు. ఏదైతేనేం ఆగస్ట్ నెల మొదటి రోజు కేంద్ర ప్రభుత్వం శుభవార్తలతో టాలీవుడ్ లో సందడి వాతావరణం నెలకొంది.
This post was last modified on August 1, 2025 8:25 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…