71 జాతీయ అవార్డుల్లో భగవంత్ కేసరికి గౌరవం దక్కింది. ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారం దక్కించుకుని బాలయ్యకు మరో మైలురాయి అందించింది. అమ్మాయిలను చదివించాలి, స్వశక్తులుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలి అనే సందేశంతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ టైంలో లియో రూపంలో ఎదురైన పోటీని తట్టుకుని భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డు అంటే నిర్మాత సాహు గారపాటితో పాటు టీమ్ మొత్తానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే. ముఖ్యంగా బాలయ్య అభిమానులకు.
భగవంత్ కేసరికి ఇవ్వడం వెనుక ప్రధాన కారణం సినిమాలో ఉన్న ట్రూ ఎమోషన్. కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ బాలయ్య రెగ్యులర్ స్టైల్ లో కాకుండా అనిల్ రావిపూడి హీరో వయసుకు తగ్గ పాత్రను డిజైన్ చేసి గొప్పగా చూపించాడు. శ్రీలీలతో స్క్రీన్ మీద చూపించిన బాండింగ్ మహిళలను ఆకట్టుకుంది. పేరుకు కాజల్ అగర్వాల్ బాలకృష్ణకు జోడిగా ఉన్నా అవసరం లేని పాటలు పెట్టి సోల్ ని చంపలేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే పలు స్కూళ్ళు కళాశాలల్లో ఈ సినిమాని స్క్రీన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అరవై కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ నమోదు చేసుకుంది.
నిజానికి గతంలో బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలకు జాతీయ అవార్డు రావాల్సింది. భైరవ ద్వీపం, ఆదిత్య 369, జననీ జన్మభూమి, సీతారామకళ్యాణం లాంటి వాటికి అభిమానులు ఆశించారు. కానీ జరగలేదు. ఇన్నేళ్లకు రావడం సంతోషించాల్సిన విషయమే. బాలకృష్ణకు గత మూడేళ్ళగా మంచి దశ నడుస్తోంది. ఒకపక్క నాలుగు బ్లాక్ బస్టర్లు పడ్డాయి. ఇంకోవైపు దశాబ్దాలుగా ఫ్యాన్స్ ఎదురు చూసిన పద్మభూషణ్ దక్కింది. నట స్వర్ణోత్సవం అంగరంగ వైభవం జరిగింది. టీవీ యాంకర్ గానూ తన ముద్ర వేశారు. ఇంత ఊపులో ఉన్న బాలయ్య చేస్తున్న షోకు తగ్గట్టు అన్ స్టాపబుల్ అనిపించేస్తున్నారు.
This post was last modified on August 1, 2025 8:06 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…