చూస్తుంటే థియేటర్లలో తక్కువ ఓటిటిలో ఎక్కువ సినిమాలు, సిరీస్ లు రిలీజవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఏది చూడాలో ఏది వదలేయాలో అర్థం కాని అయోమయంలో ప్రేక్షకులు రివ్యూల మీద ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ వీక్ లిస్టు చూస్తే ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందో అర్థమవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ‘తమ్ముడు’ వచ్చేసింది. థియేటర్లలో దారుణంగా బోల్తా కొట్టిన ఈ మూవీని రెగ్యులర్ ఆడియన్స్ మిస్సయ్యారు. డీసెంట్ టాక్ తెచ్చుకున్న సిద్దార్థ్ ‘3 బిహెచ్కె’ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సుహాస్ ‘ఓ భామ అయ్యో రామా’ని డిజిటల్ జనాలు ఆదరిస్తారేమోనని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.
తెలుగు డబ్బింగ్ తో పాటు అన్ని మెయిన్ లాంగ్వేజెస్ లో ‘సితారే జమీన్ పర్’ యూట్యూబ్ లో కేవలం 100 రూపాయలకు అందుబాటులోకి వచ్చేసింది. అమీర్ ఖాన్ కోసం చూసేవాళ్లు పెద్ద ఎత్తున ఉంటారని ఒక అంచనా. విమర్శకుల ప్రశంసలు అందుకున్న తమిళ కోర్ట్ రూమ్ డ్రామా ‘సట్టముం నీతియుమ్’ ని కొంత ఆలస్యంగా అయినా టాలీవుడ్ ఫ్యాన్స్ కోసం అనువాదం చేసి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నిన్నటి దాకా పే పర్ వ్యూ మోడల్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ‘హౌస్ ఫుల్ 5 ఏబి’ వెర్షన్లు ఇవాళ్టి నుంచి సబ్స్క్రైబర్స్ అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి.
ఈటీవీ విన్ లో ‘రెడ్ శాండల్ వుడ్’ నిన్నటి నుంచే అందుబాటులోకి వచ్చేసింది. ఇవి కాకుండా పదిహేనుకు పైగా వివిధ సిరీస్ లు ఇంటర్నేషనల్ కంటెంట్లు వేర్వేరు ఓటిటిల్లో రిలీజయ్యాయి. ఓపిగ్గా వెతుక్కుని టైం పెట్టుకోవాలే కానీ కాలక్షేపానికి ఢోకా లేకుండా ఎన్నో ఆప్షన్లు మూవీ లవర్స్ కు ఇప్పుడున్నాయి. కాకపోతే కన్ఫ్యూజ్ అయ్యేలా అందరూ ఒకేసారి శుక్రవారమే కంటెంట్ ని రిలీజ్ చేయడం వ్యూస్ మీద ప్రభావం చూపిస్తోంది. అలా కాకుండా వీక్ డేస్ లో కూడా రిలీజులు ప్లాన్ చేసుకుంటే ఉభయకుశలోపరిగా ఉంటుంది. థియేటర్లకు పోటీగా ఇలా గంపగుత్తగా రావడం వల్ల అనవసరమైన అయోమయం ఏర్పడుతోంది.
This post was last modified on August 1, 2025 6:30 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…