ఒకే ఆలోచన ఇద్దరికి రావడం మాములే. క్రియేటివ్ ఫీల్డ్ లో తరచుగా ఇది జరుగుతూ ఉంటుంది. కొన్ని వివాదాలు అయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని గుర్తుపట్టకుండా మాయమైపోవడం ఎప్పటికీ ప్రపంచానికి తెలియవు. కొన్ని ఎటూ తప్పించుకునే ఛాన్స్ లేక బయటపడతాయి. మొన్న ఫిబ్రవరిలో విడుదలైన తండేల్ నాగచైతన్యకు మొదటి వంద కోట్ల గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వరస ఫ్లాపులతో సతమతమవుతున్నప్పుడు ఈ సినిమా రూపంలో తనకో పెద్ద ఊరట దక్కింది. హీరోయిన్ సాయిపల్లవి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లాంటి ఆకర్షణలు జనాన్ని మెప్పించుకుని మెచ్చుకునేలా చేశాయి. ఇదంతా గతం.
వచ్చే వారం అమెజాన్ ప్రైమ్ లో అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ రాబోతోంది. సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించగా ఆనంది ఫిమేల్ లీడ్ గా చేసింది. ట్రైలర్ చూస్తే తండేల్ గుర్తు రాకుండా ఉండటం అసాధ్యం. శ్రీకాకుళం జాలర్లు పొరపాటున సముద్రంలో పాకిస్థాన్ ఆర్మీకి చిక్కడం, అక్కడ జైల్లో నానా నష్టాలు పడటం, వాళ్ళ కుటుంబాలు న్యాయం కోసం ఢిల్లీకి వెళ్లడం ఇదంతా అరేబియా కడలో ఉంది. పాక్ పోలీస్ వ్యాన్ లో హీరో బృందం వెళ్తున్నప్పుడు దాడి జరిగే ఎపిసోడ్ కూడా రెండింట్లో ఒకేలా కనిపిస్తోంది. ఇన్ని సారూప్యతలు చూసి చైతు ఫ్యాన్స్ సైతం షాక్ తింటున్నారు. ఇదేంటని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
నిజానికి ఈ అరేబియా కడలిని చింతకింది శ్రీనివాస్ అనే జర్నలిస్టు రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. క్రిష్ దీనికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ కాగా వివి సూర్యకుమార్ దర్శకుడు. తండేల్ తీస్తున్న టైంలో కొంత కాంట్రావర్సి రాగా ఈ ఘటనలో నిజమైన బాధితులుగా ఉన్న వాళ్లకు రాయల్టీ చెల్లించి గీతా ఆర్ట్స్ హక్కులు కొందనే ప్రచారం ఆ మధ్య జరిగింది. తెరవెనుక ఏం జరిగిందో కానీ అరేబియా కడలి రిలీజ్ లో కొంత ఆలస్యం జరిగింది. కాకపోతే దీనికి తండేల్ కు మధ్య తక్కువ గ్యాప్ ఉండటంతో పోలికల పర్వం తప్పదు. మరి నాగచైతన్య, సాయిపల్లవిలాంటి స్టార్లు చేసిన పాత్రల్లో సత్యదేవ్, ఆనంది ఎలా మెప్పిస్తారో చూడాలి.
This post was last modified on August 1, 2025 2:59 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…