డిసెంబర్ 5 విడుదల కాబోతున్న ది రాజా సాబ్ రిలీజ్ డేట్ గురించి ఫిలిం నగర్ వర్గాల్లో మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. వాయిదా పడొచ్చంటూ, 2026 సంక్రాంతికి వెళ్లేలా పలు వర్గాలకు లీకులు ఇస్తున్నట్టు సోషల్ మీడియా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి మేకర్స్ మార్పు కోరుకోవడం లేదు. సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన పోస్టర్ లోనూ అదే స్పష్టం చేశారు. ప్రభాస్ ఫుల్ కో ఆపరేషన్ తో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఫౌజీకి బ్రేక్ ఇచ్చి సహకారం అందిస్తున్నాడు. ఇదంతా టైంకి సినిమా థియేటర్లలో అడుగు పెట్టడం కోసమే. ఒకవేళ పొంగల్ బరిలోకి వెళ్తే మాత్రం రిస్క్ అవుతుంది.
ఎందుకంటే ఇప్పటికే కొన్ని స్లాట్లు లాకైపోయాయి. చిరంజీవి 157ని పండగ బరిలో దింపాలనే లక్ష్యంతోనే దర్శకుడు అనిల్ రావిపూడి శరవేగంగా పరిగెత్తిస్తున్నాడు. మూడు షెడ్యూల్స్ అయిపోయాయి. కొత్తది స్టార్ట్ కాబోతోంది. ఇందులో ప్రత్యేక పాత్ర చేస్తున్న వెంకటేష్ తాలూకు లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేశారు. ఇంత పక్కా ప్లానింగ్ తో ఉంటే వాయిదా సమస్యే ఉండదు. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఆన్ ట్రాక్ లో ఉంది. ఇది కూడా సంక్రాంతి బొమ్మే. రవితేజ అనార్కలి (ప్రచారంలో ఉన్న టైటిల్) ఆల్రెడీ అనౌన్స్ చేసుకుంది. విజయ్ జన నాయగన్ జనవరి 9 ఎప్పుడో ప్రకటించేసుకుంది. ఇంత పోటీ ఉంది.
ఒకవేళ రాజా సాబ్ కనక సంక్రాంతి అంటే మాత్రం పైన చెప్పిన వాటిలో ఒకటో రెండో తప్పుకోవాల్సి ఉంటుంది. అది ఎవరనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇంకో కోణంలో ఎంత ప్రభాస్ సినిమా అయినా అవతలి వాళ్ళను తక్కువంచనా వేయకూడదు. బాహుబలి తర్వాత వచ్చిన డార్లింగ్ సినిమాలన్నీ సోలో రిలీజ్ తో లాభ పడినవే. టఫ్ కాంపిటేషన్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు. ఇప్పుడు సవాల్ కి సై అంటే ఓపెనింగ్స్, రెవిన్యూ రెండూ పంచుకోవాల్సి ఉంటుంది. ఇతర బాషల మార్కెట్ కోణంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి చివరికి రాజా సాబ్ ఏం చేస్తాడో వేచి చూడాలి.
This post was last modified on July 31, 2025 9:27 am
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…