సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకు ప్రత్యేకంగా ఓవర్ పబ్లిసిటీ అక్కర్లేదు. అలాంటిది ఆయనకు లోకేష్ కనగరాజ్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ తోడైతే చెప్పేదేముంది. ఆకాశమే హద్దుగా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. కానీ సన్ పిక్చర్స్ ప్రమోషన్లను లైట్ తీసుకోవడం లేదు. ఆడియన్స్ కి దగ్గరయ్యేందుకు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేసి చూపిస్తోంది. ప్రోమోలు, ఇంటర్వ్యూలు, వైరల్ కంటెంట్లు ఒకటా రెండా ప్రతి దాంట్లోనూ తనదైన ముద్ర చూపిస్తూ కాంపిటీషన్ లో ఉన్న వార్ 2ని వెనక్కు నెట్టేసింది. ఒకరకంగా చెప్పాలంటే సన్ స్ట్రాటజీలు చూసి రజనితో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
సర్వాంతర్యామి తరహాలో ఎక్కడ చూసినా కూలి కనిపించేలా వినిపించేలా సన్ టీమ్ వేస్తున్న ప్లాన్లు బ్రహ్మాండంగా వర్కవుట్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ పార్సిల్ చేసే వస్తువుల బాక్సుల మీద పెద్ద పెద్ద కూలి స్టిక్కర్లు వేయించడం కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే కర్ణాటకకు వెళ్లే బాక్సుల మీద కన్నడ భాషలో టైటిల్ ఫాంట్ వేశారు. అంతే కాక ఉపేంద్రని రజనితో సమానంగా హైలైట్ చేయడం ద్వారా రీజనల్ సెంటిమెంట్ టచ్ చేస్తున్నారు. ఇదే ఫార్ములాతో ఏపీ తెలంగాణ బాక్సులకు నాగార్జున పిక్ ని ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా అటెన్షన్ పెంచుతున్నారు.
వచ్చే వారం చెన్నైలో జరగబోయే కూలి ఈవెంట్ సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని కోలీవడ్ మీడియా కోడై కూస్తోంది. రెగ్యులర్ వేడుకలకు భిన్నంగా చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారని, ఒక పెద్ద సినిమాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో లైవ్ ఈవెంట్ ఉంటుందని, ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్ చేసేలా లోకేష్ కనగరాజ్ టీమ్ డిజైన్ చేసిందని అంటున్నారు. ఆగస్ట్ 14 దాకా ఇలాంటివి నాన్ స్టాప్ గా చేసేలా సర్వం సిద్ధం చేశారు. బయట రాష్ట్రాల ప్రమోషన్లకు రజనీకాంత్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవెంతవరకు సఫలీకృతమవుతాయో చూడాలి. ఏది ఏమైనా కూలీ మేనియా మాములుగా లేదు.
This post was last modified on July 30, 2025 10:07 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…