సితారే జమీన్ పర్ విడుదలకు ముందు ఎన్ని ఓటిటిలు ఆఫర్లతో టెంప్ట్ చేసినా చలించకుండా యూట్యూబ్ లోనే స్ట్రీమింగ్ చేస్తానని శపథం చేసిన అమీర్ ఖాన్ అన్నంత పని చేశాడు. ఆగస్ట్ 1 నుంచి ఈ సూపర్ హిట్ మూవీని కేవలం 100 రూపాయలకు ఇంట్లోనే కుటుంబం మొత్తం చూడొచ్చని ప్రకటించాడు. దీనికి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ మెంట్ ఇవ్వడం విశేషం. అమీర్ లాంటి స్టార్ హీరో ఇలాంటి రిస్క్ చేయడం బాలీవుడ్ హిస్టరీలో ఇది మొదటిసారి. ఎందుకంటే సితారే జమీన్ పర్ ఫ్లాప్ కాలేదు. ఈ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఏ సెంటర్స్ లో భారీ వసూళ్లు సాధించి హిట్టు కొట్టింది.
ఇలాంటి సినిమాను యూట్యూబ్ లో వదలడం అంటే సాహసమే. స్ట్రీమింగ్ ఆప్షన్ పరిమిత రోజులకే అయినా ఆలోగా ఫ్యామిలీ మొత్తం చూసేయడానికి ఇది మంచి ఆప్షన్. ఇప్పుడీ నిర్ణయం పట్ల ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అమీర్ ఖాన్ కొచ్చే ఆదాయం ఎంత ఉంటుందనే దాన్ని బట్టి భవిష్యత్తులో తాము ఇదే దారిలో వెళ్లేందుకు ఉపయోగపడుతుందని ఇతర నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఆరు నెలల దాకా తన సినిమాని డిజిటల్ లో వదిలే ప్రసక్తే లేదని ఆ మధ్య చెప్పిన అమీర్ ఖాన్ ఇప్పుడు మాట తప్పి కేవలం యాభై రోజులకే రిలీజ్ చేయడం గమనించాల్సిన పరిణామం.
కొద్దిరోజుల క్రితమే సితారే జమీన్ పర్ హెచ్డి లీక్ బయటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో దీన్ని ఇంకా నానబెడితే యూట్యూబ్ లో చూసేవాళ్ళు కూడా తగ్గిపోతారు. అందుకే డెసిషన్ మార్చుకుని ఉండొచ్చు. థియేటర్ రిలీజ్ కు ముందు నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు వంద కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చినా వద్దని చెప్పిన అమీర్ ఖాన్ ఇప్పుడు అంతకంటే ఎక్కువ డబ్బును యూట్యూబ్ లో సంపాదించి చూపించాలి. లేదంటే పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఒకవేళ ఈ మోడల్ ఇప్పటికి ఫెయిలైనా ఫ్యూచర్ లో ఇతరులకు ఉపయోగపడే అవకాశాలను కొట్టి పారేయలేం. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు. వేచిచూడాలి.
This post was last modified on July 29, 2025 4:46 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…