ఏంటీ లావణ్య త్రిపాఠి.. భర్తను చితగ్గొట్టేస్తోందా? పాపం వరుణ్ తేజ్ అని జాలిపడకండి. ఇది ఆమె నిజ జీవితానికి సంబంధించిన విషయం కాదు. సినిమా సంగతి. పెళ్ళి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసి, ఒక దశలో పూర్తిగా సినీ రంగానికి గుడ్ బై చెప్పేసినట్లు కనిపించిన లావణ్య.. కొంచెం గ్యాప్ తర్వాత ‘సతీ లీలావతి’ అనే సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమాను మొదలుపెట్టిన లావణ్య.. తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించే సమయానికే చకచకా సినిమాను పూర్తి చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఫస్ట్ టీజర్‌ను లాంచ్ చేశారు. ఇది భర్తను చిత్రహింసలు పెట్టే భార్య కథ కావడం విశేషం. మలయాళంలో పెద్ద హిట్టయిన ‘జయ జయ జయ జయహే’ సినమాను గుర్తు చేసేలా ఈ సినిమా టీజర్ సాగింది.
‘శాకుంతలం’ చిత్రంలో దుష్యంతుడి పాత్ర పోషించిన మలయాళ నటుడు దేవ్ పటేల్ ‘సతీ లీలావతి’లో లావణ్య భర్త పాత్రలో నటించాడు. హ్యాపీగా పెళ్లి చేసుకున్న ఒక యువ జంట జీవితంలో వెంటనే కలహాలు మొదలవుతాయి. ఇలా గొడవ పడడం కంటే విడాకులు తీసుకుందాం అంటాడు భర్త. కట్ చేస్తే.. తర్వాతి రోజు అతను కుర్చీకి కట్టేయబడి ఉంటాడు. అలా అతణ్ని బంధించి చితక బాదేస్తుంటుంది భార్య. ఆ ఇంట్లో ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తూ బయటి నుంచి ఒక బ్యాచ్ ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తుంటుంది.
ఇంతకీ ఈ భార్య శాడిజానికి కారణమేంటి.. భర్తను ఎందుకలా బాదేస్తుంది.. ఈ విషయాలన్నీ సస్పెన్స్ అన్నమాట. ఈ మధ్య తెలుగు సినిమాల్లో బాగా నవ్వులు పండిస్తున్న తమిళ నటుడు వీటీవీ గణేష్ ఇందులో ఓ కీలక పాత్ర చేశాడు. మరో తమిళ కమెడియన్ మొట్ట రాజేంద్రన్.. సప్తగిరి సహా కామెడీ బ్యాచ్ పెద్దగానే ఉంది. ఇదొక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అనే సంకేతాలను ఇచ్చింది టీజర్. ఇంతకుముందు నానితో ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమా తీసిన తాతినేని సత్య ఈ చిత్రాన్ని రూపొందించాడు. కొత్త నిర్మాత నాగ కిషోర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించనుంది.
This post was last modified on July 29, 2025 3:38 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…