టాలీవుడ్లో చాలా వేగంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ ఆరంభంలో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘కరెంటు తీగ’ లాంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చేసిన ఆమె.. తర్వాత వరుసబెట్టి పెద్ద స్టార్లతో సినిమాలు చేసింది. ఆమె కంటే ముందు అగ్ర కథానాయికలుగా ఉన్న వాళ్లందరి జోరు తగ్గిపోగా.. రకుల్ వరుసగా భారీ చిత్రాలతో టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ఆ కిరీటం ఎంతో కాలం నిలవలేదు. వరుస పరాజయాలు రకుల్ కెరీర్‌ను దెబ్బ తీశాయి. ఉన్నట్లుండి టాలీవుడ్ నుంచి అంతర్ధానమయ్యే పరిస్థితికి వచ్చేసింది.
కానీ అదే సమయంలో ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. యారియా, దే దే ప్యార్ దే లాంటి సినిమాల్లో నటించింది. ఇందులో ‘దేదే ప్యార్ దే’ పెద్ద హిట్టయింది కూడా. ఈ చిత్రంలో తన వయసు కంటే దాదాపు డబుల్ ఉన్న అజయ్ దేవగణ్‌తో జోడీ కట్టింది రకుల్. ఐతే కథ రీత్యా ఆ పాత్రకు బాగానే ఫిట్ అయింది.
‘దేదే ప్యార్ దే’లో ఇటు అందంతో, అటు అభినయంతో ఆకట్టుకున్న రకుల్.. మరోసారి అజయ్ దేవగణ్‌తో నటించబోతుండటం విశేషం. ఆమె తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కనున్న చిత్రంలో అజయ్ అవకాశమిచ్చాడు. ఇంతకుముందు దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ‘శివాయ్’ చిత్రాన్ని రూపొందించిన అజయ్.. ఇటీవలే దర్శకుడిగా తన రెండో చిత్రం ‘మే డే’ను ప్రకటించాడు.
ఇందులో అజయ్ పైలట్ పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇందులో రకుల్ కూడా నటించనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇంకొన్ని రోజుల్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. ‘దే దే ప్యార్ దే’ సినిమాలో రకుల్ పెర్ఫామెన్స్‌కు అజయ్ బాగానే ఇంప్రెస్ అయ్యాడని తన సొంత సినిమాలో అవకాశమివ్వడాన్ని బట్టి అర్థమవుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మధ్యలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 19, 2020 11:00 am
ఏడేళ్ల క్రితం ఒక చిన్న సీన్ ఆమెకు ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. కుర్రాడిని చూస్తూ కన్నుగీటుతున్న సన్నివేశం…
సజ్జల రామకృష్ణారెడ్డి... అటు సొంత పార్టీ వైైసీపీతో పాటు ఇటు ఆ పార్టీ వైరి వర్గాల్లోనూ నిత్యం నానుతూ ఉండే పేరిది.…
ఈ వారం విడుదల కాబోతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో క్లైమాక్స్ గురించి టీమ్ పదే పదే హైలైట్ చేస్తూ చెప్పడం…
నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ చూసి క్రికెట్ అభిమానులు ఊగిపోయారు. ముఖ్యంగా అభిషేక్…
గత ఏడాది విశ్వంభర టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ ఏ స్థాయిదో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. అందుకే నెలల తరబడి…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…