‘ఆదిపురుష్’ నుంచి అప్ డేట్ అంటే… ఈ చిత్రంలో సీత పాత్ర పోషించేదెవరో వెల్లడిస్తారేమో అనుకున్నారు అభిమానులు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన ఆశ్చర్యపరిచాడు ప్రభాస్. 2022 ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా విషయంలో అప్ డేట్ల మీద అప్ డేట్లు ఇస్తుండటం, షూటింగ్‌కు కూడా సన్నాహాలు చేస్తుండటంతో వచ్చే ఏడాదే ఈ సినిమా విడుదలైపోతుందనే అంచనాలతో ఉన్నారంతా.
కానీ ఊహించని విధంగా సినిమాను అనుకున్నదానికంటే ఏడాది ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీని కంటే ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్-ప్రభాస్ సినిమా విషయంలో ముందు నుంచే అయోమయం నడుస్తుండగా.. తాజా ప్రకటనతో అయోమయం ఇంకా పెరిగిపోయింది.
ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్ సినిమాను కాకుండా.. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ను టేకప్ చేయడమే చాలామందికి రుచించలేదు. ఇప్పటికే స్క్రిప్టు పూర్తి చేసి ప్రి ప్రొడక్షన్ పనిలో ఉన్న నాగ్ అశ్విన్ టీంకు ఇది షాక్ అన్నట్లే మాట్లాడుకున్నారు. ఐతే ‘ఆదిత్య 369’ తరహాలో సైంటిఫిక్ టచ్ ఉన్న ఫాంటసీ థ్రిల్లర్ కావడంతో దీని చిత్రీకరణకు ఎక్కువ సమయం పడుతుందని.. అందుకే వేగంగా ‘ఆదిపురుష్’ను పూర్తి చేసి.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు మీదికి ప్రభాస్ వెళ్లబోతున్నాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ‘ఆదిపురుష్’కే చాలా సమయం తీసుకోబోతున్నాడు ప్రభాస్.
రాధేశ్యామ్ పని ఇంకొన్ని నెలల్లో పూర్తి చేశాక వచ్చే ఏఢాదంతా ‘ఆదిపురుష్’ తన సమయాన్ని కేటాయించేలా ఉన్నాడు ప్రభాస్. ఆ తర్వాత ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం పట్టేలా ఉంది. బహుశా చిత్ర బృందం ఆ పనిలో ఉండగా.. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా మీదికి వెళ్లిపోతాడేమో. అది కూడా పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం తీసుకునే సినిమా. 2022లో ఆ సినిమా చిత్రీకరణ సాగినా.. విడుదల మాత్రం 2023లోనే అని స్పష్టమవుతోంది. మొత్తంగా చూస్తే ‘మహానటి’ చేశాక నాలుగేళ్లకు కానీ నాగ్ అశ్విన్ తర్వాతి సినిమా విడుదల కాదన్నమాట.
This post was last modified on November 19, 2020 10:56 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…