దివ్య స్పందన.. తెలుగు వారికీ పరిచయం ఉన్న కన్నడ నటి. నందమూరి కళ్యాణ్ రామ్ అభిమన్యుతో పాటు సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంతోనూ తెలుగు వారిని పలకరించిన దివ్య.. కథానాయికగా కెరీర్ ముగిశాక రాజకీయ రంగప్రవేశం చేసింది. కాంగ్రెస్ తరఫున ఒకసారి ఎంపీగా కూడా గెలిచింది. అలాంటి సెలబ్రెటీకి కన్నడ హీరో దర్శన్ అభిమానుల నుంచి రేప్ బెదిరింపులు రావడం గమనార్హం. దర్శన్ అభిమానులు, తనతో పాటు తన పిల్లలను కూడా వదలకుండా బూతులు తిడుతూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని.. రేప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని రమ్య బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దర్శన్ తన అభిమాని అయిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరు నెలల పాటు జైల్లో ఉన్న దర్శన్.. గత ఏడాది చివర్లో బెయిల్ మీద విడదులయ్యాడు. ఐతే ఈ కేసులో రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరగాలంటూ రమ్య వ్యాఖ్యానించడంతో దర్శన్ అభిమానులకు కోపం వచ్చింది. ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా తిట్టడం, బెదిరించడం చేశారు. రమ్యతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీదా దూషణలకు దిగారు. రేణుకాస్వామికి బదులు నువ్వు చావాల్సిందని కూడా కామెంట్లు చేశారు.
దీంతో రమ్య దర్శన్ అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రేయసిని దారుణమైన మెసేజ్‌లతో వేధించిన కారణంతోనే రేణుకాస్వామిని దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేణుకాస్వామితో దర్శన్ మిగతా అభిమానులను ఆమె పోల్చింది.
”రేణుకా స్వామికి, దర్శన్ అభిమానులకు ఎలాంటి తేడా లేదు. రోజూ కొంతమంది అభిమానులు.. రేప్ చేసి, చంపేస్తామని నన్ను వేధిస్తున్నారు. ఆడవాళ్లను వేధించడం ఓ అలవాటుగా మారిపోయింది. బెంగళూరు పోలీస్ కమీషనర్‌ని కలవబోతున్నా. నా లాయర్లతో ఈ కేసు గురించి మాట్లాడుతున్నా. ఓ మహిళ విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించడం చాలా పెద్ద నేరం. దీన్ని క్షమించకూడదు” అని దివ్య పేర్కొంది. బెయిల్ మీద బయటికి వచ్చాక దర్శన్.. ది డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అతడి బెయిల్ రద్దు విషయమై ఇటీవల సుప్రీం కోర్టు కర్ణాటక హైకోర్టును తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 28, 2025 7:58 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…