సంగీత దర్శకులకు టైంకి సక్సెస్ రాకపోతే అవకాశాలు కష్టం. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే ముందు ప్రూవ్ చేసుకోవాలి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ వారసుడు మహతి స్వరసాగర్ ఛలో ఆల్బమ్ ఇచ్చినప్పుడు అందరూ అతను పెద్ద రేంజ్ కి వెళ్తాడని ఆశించారు. భీష్మ కూడా సక్ససయ్యాక తిరుగు లేదనుకున్నారు. చిన్న వయసులోనే చిరంజీవికి కంపోజ్ చేసే ఛాన్స్ రావడం చూసి తండ్రికి తగ్గ తనయుడు అవుతాడని భావించారు. భోళా శంకర్ సినిమా ఎంత బ్యాడ్ అయినా కనీసం పాటలైనా బాగుంటే ఫ్యాన్స్ కొంత రిలీఫ్ ఫీలయ్యేవాళ్ళు. కానీ అది జరగలేదు. దీని తర్వాత కుర్రాడి గురించి ఎలాంటి అప్డేట్స్ లేకుండా పోయాయి.
కట్ చేస్తే ఇప్పుడో క్రేజీ ఆఫర్ తన జేబులో వేసుకున్నాడు మహతి స్వరసాగర్. విజయ్ సేతుపతి – పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కుతున్న మూవీకి ఇతన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారని సమాచారం. పూరికి మణిశర్మతో మంచి బాండింగ్ ఉంది. పోకిరి రూపంలో ఇద్దరూ కలిసి ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ సాధించారో ఎవరూ మర్చిపోలేరు. ఇస్మార్ట్ శంకర్ ఈ కాంబోకి మంచి కంబ్యాక్ అయ్యింది కానీ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ ఇద్దరూ చూడలేకపోయారు. బహుశా ఈ అనుబంధం వల్లే మహతికి పూరి ఛాన్స్ ఇచ్చాడా లేక చలో లాంటి ఆల్బమ్స్ విని ఇచ్చాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
లైగర్, డబుల్ ఇస్మార్ట్ తర్వాత బలమైన కంబ్యాక్ ఇవ్వాల్సిన ఒత్తిడిలో పడ్డ పూరి జగన్నాధ్ కు విజయ్ సేతుపతి మూవీ జాక్ పాట్ లా తగిలింది. ఎక్కువ ఆలస్యం చేయకుండా వేగంగా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ ప్లానింగ్ జరిగిపోయింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా టబు, దునియా విజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో ఇద్దరు సర్ప్రైజ్ ఆర్టిస్టులు ఉంటారనే టాక్ ఉంది కానీ ఆ పేర్లేవో తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ లో టీజర్ విడుదల చేసే ఆలోచనలో పూరి జగన్నాధ్ ఉన్నట్టు వినికిడి.
Gulte Telugu Telugu Political and Movie News Updates