పేరుకి మలయాళ హీరోనే అయినా తెలుగువాళ్లకు బాగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ కు భలే సినిమాలు పడుతున్నాయి. కంటెంట్ కోసం దర్శకులు నిర్మాతలు నానా తిప్పలు పడుతుంటే మనోడు మాత్రం మహానటి, సీతారామం లాంటి క్లాసిక్స్ ని పట్టేస్తున్నాడు. తాజాగా కాంత కూడా అదే కోవలో చేరేలా ఉంది. దగ్గుబాటి రానాతో పాటు మరో ఇద్దరితో కలిసి దుల్కర్ సల్మాన్ దీనికి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సెప్టెంబర్ 12 విడుదల కాబోతున్న కాంత కథ గురించి ఇప్పటిదాకా ఎలాంటి క్లూస్ లేవు కానీ ఇవాళ లాంచ్ చేసిన రెండు నిమిషాల టీజర్ లో స్టోరీ లైన్ ఏంటో ఇంటరెస్టింగ్ గా చెప్పారు.
అది స్వాతంత్రం వచ్చిన కొత్తలో తెలుగు సినిమా పైకొస్తున్న సువర్ణ యుగం. శాంత పేరుతో మొదటి హారర్ మూవీకి శ్రీకారం చుడతాడో మహా దర్శకుడు (సముతిరఖని). శిష్యుడి (దుల్కర్ సల్మాన్) నే కథానాయకుడిగా పెట్టుకుంటాడు. ఓ అందాల బొమ్మ (భాగ్యశ్రీ బోర్సే) హీరోయిన్ గా చేరుతుంది. తండ్రి కొడుకుల్లా అప్పటిదాకా కలిసి మెలిసి ఉన్న హీరో, డైరెక్టర్ కు మధ్య ఈగో వార్ మొదలవుతుంది. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో మంట పుడుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే మీడియా ముందుకొచ్చి హీరో తన సినిమా పేరు శాంత కాదు కాంత అని ప్రకటించేంత. అసలేం జరిగిందో తెలుసుకోవడమే కథ.
పాత కాలం బ్యాక్ డ్రాప్ కాబట్టి అప్పటి వాతావరణాన్ని సృష్టించి కాంతకు కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చారు. దుల్కర్, సముతిరఖని ఇద్దరూ పోటాపోటీగా పెర్ఫార్మ్ చేయడాన్ని హైలైట్ చేశారు. పైనేదో కథను గెస్ చేసేలా విజువల్స్ చూపించారు కానీ అసలు ట్విస్టులు, జానర్ వేరే ఉన్నాయి. జాను చంతర్ సంగీతం, డానీ సంజె లోపెజ్ ఛాయాగ్రహణం సమకూర్చిన కాంత కథ ప్రధానంగా పైన చెప్పిన మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్ మేళవించిన కాంత గురించి రహస్యం బయట పడాలంటే సెప్టెంబర్ 12 దాకా వేచి చూడాలి. స్పిరిట్ మీడియా, వేఫరేర్ ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో కాంత రూపొందింది.
This post was last modified on July 28, 2025 5:25 pm
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…