ఎంతో కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు విజయ్ దేవరకొండ. సరైన లుక్స్, యాక్టింగ్ స్కిల్స్ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్‌ను నమ్ముకుని వచ్చి హీరోలుగా నిలదొక్కుకోవడానికి కష్టపడే వారసులను.. విజయ్‌తో పోల్చి ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. ఐతే వేరే హీరోలను ఇలా ట్రోల్ చేసే విజయ్ అభిమానులు.. విజయ్ తమ్ముడి విషయంలో ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి తలెత్తింది.
విజయ్‌తో పోలిస్తే అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ.. తన తొలి చిత్రం ‘దొరసాని’లో అన్ని రకాలుగా తేలిపోయాడు. ముఖ్యంగా లుక్స్ విషయంలో అతను చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు. తమ్ముణ్ని హీరోగా చేయడంపై విజయ్‌ను సైతం చాలామంది తప్పుబట్టారు. కానీ అన్నదమ్ములు అవేమీ పట్టించుకోలేదు. తొలి సినిమా పోయినా.. ఆనంద్ అన్న అండతో బాగానే అవకాశాలు సంపాదించాడు.
ఆనంద్ రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చకచకా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 20న అమేజాన్ ప్రైమ్‌లో అది విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ.. తన అన్నతో పోలికే తనకు అది పెద్ద ప్రతికూలత అని చెప్పాడు. తనను విజయ్‌తో ప్రేక్షకులు పోల్చి చూడొద్దన్నాడు.
‘‘విజయ్‌తో పోలికే నాకు అతి పెద్ద సమస్య. అతను హీరోగా చాలా పెద్ద స్థాయికి వెళ్లాడు. పెద్ద విజయాలు చూశాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. విజయ్‌తో పోల్చి నా గురించి, నా సినిమాల గురించి ప్రేక్షకులు చాలా మాటలు అన్నారు. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమైంది. ఐతే విజయ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి రావడం వల్ల నాకు కలిగిన ప్రయోజనాలు ఎన్నో’’ అని ఆనంద్ తెలిపాడు. భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు రూపొందించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ట్రైలర్‌తో అయితే బాగానే ఆకట్టుకుంది. మరి సినిమాగా ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on November 18, 2020 7:23 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…