ఈ మధ్య వెబ్ సిరీస్ లను జనం అంత సీరియస్ గా పట్టించుకుంటున్నట్టు లేదు. కొత్త రిలీజులు ఉంటున్నా ఎక్స్ ట్రాడినరి రివ్యూలు, సోషల్ మీడియా టాక్స్ వస్తే తప్ప ఆడియన్స్ దృష్టిలో పడటం లేదు. అలాంటిదే మండల మర్డర్స్. మొన్న శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నాని ఆహా కళ్యాణం హీరోయిన్ వాణి కపూర్ ప్రధాన పాత్ర పోషించగా చాలా పెద్ద బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. గోపి పుత్రన్ – మనన్ రావత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణ భాగస్వామి కావడంతో ఖర్చు పరంగా రాజీ లేకుండా ప్రొడక్షన్ చేయడం వల్ల మంచి క్వాలిటీ స్క్రీన్ మీద కనిపించింది.
స్టోరీ లైన్ ఆసక్తికరంగా ఉంటుంది. 1952 నుంచి 2025 మధ్యలో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో చూపిస్తారు. ఉత్తర్ ప్రదేశ్ లోని చరణ్ దాస్ అనే ఊరికి దగ్గరలో ఉన్న వరుణ అడవిలో ఒక మాంత్రికుల గుంపు ఉంటుంది. ఎవరైనా వచ్చి బొటన వేలిని సమర్పిస్తే ఎంత పెద్ద కోరిక అయినా తీర్చే సైతాన్ దైవం వాళ్ళ స్వంతం. హఠాత్తుగా చాలా దారుణమైన స్థితిలో కొందరి హత్యలు జరుగుతాయి. దీని ఇన్వెస్టిగేషన్ చేపట్టిన లేడీ సిబిఐ ఆఫీసర్ కు తోడుగా ఢిల్లీ నుంచి వచ్చిన సస్పెండ్ పోలీస్ కలిసి విస్తుపోయే నిజాలు తెలుసుకుంటారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకునే క్రమంలో దారుణమైన వాస్తవాలు బయట పడతాయి.
మూఢనమ్మకం, రాజకీయం, సామజిక పరిస్థితులు, జనాల అమాయకత్వం ఇలా అన్ని అంశాలను జోడించి మండల మర్డర్స్ ని ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందించారు. బోలేడన్ని పాత్రలు ఉన్నప్పటికీ ప్రతిదానికి తగిన ప్రాధాన్యం ఇచ్చి వాటిని ట్విస్టులకు ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంది. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్ లో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ లో మలుపులు ఊహకందని విధంగా ఉంటాయి. హింస ఉన్నప్పటికీ మరీ జుగుప్సాకరంగా అనిపించదు. ఒకటి రెండు తప్ప పెద్ద అడల్ట్ సీన్స్ లేవు. తెలుగు డబ్బింగ్ ఉంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ప్రధాన బలంగా సాగే మండల మర్డర్స్ ని ఈ జానర్ ఆడియన్స్ ట్రై చేయొచ్చు. నిరాశపరచదు.
This post was last modified on July 27, 2025 9:15 pm
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…