పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజవుతుంటే.. దానికి పోటీగా వేరే చిత్రాలను రిలీజ్ చేయడానికి భయపడతారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. తెలుగు నుంచి పవన్ సినిమాకు పోటీగా మరే చిత్రం విడుదల కాలేదు. దీంతో ఓ వారం పాటు ‘వీరమల్లు’దే రాజ్యం అనుకున్నారు. కానీ ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఊహించని పోటీ ఎదురైంది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన కన్నడ అనువాద చిత్రం ‘మహావతార నరసింహ’ ఇప్పుడు పవన్ సినిమాను సవాలు చేస్తోంది.
శుక్రవారం ఈ సినిమా రిలీజవుతుంటే జనం పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించలేదు. అసలే అనువాద చిత్రం. పైగా ఇందులో స్టార్లు లేరు. అందులోనూ యానిమేషన్ మూవీ. దీంతో అందరూ ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నట్లు కనిపించారు. కానీ రిలీజ్ రోజు సాయంత్రానికి కథ మారిపోయింది. ఇది మన కల్ట్ మూవీ ‘భక్త ప్రహ్లాద’ కథతో యానిమేషన్లో రూపొందిన సినిమా. ఈ కథతో మన వాళ్లకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. యానిమేషన్లో విజువల్ ఎఫెక్ట్స్‌ను అద్భుతంగా వాడుకుని కొన్ని ఎపిసోడ్లను కళ్లు చెదిరే రీతిలో రూపొందించడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.
తొలి రోజు సాయంత్రం మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడ్డాయి. రెండో రోజు ఉదయం నుంచే మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. శనివారం సాయత్రం ఈ సినిమాకు అసాధారణమైన ఆక్యుపెన్సీలు కనిపించాయి. ఆదివారం పవన్ సినిమాను డామినేట్ చేసే స్థాయిలో ఈ సినిమాకు ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో బుక్ మై షోలో ‘హరిహర వీరమల్లు’కు లక్ష పైచిలుకు టికెట్లు అమ్ముడైతే.. ‘మహావతార నరసింహ’కు 2 లక్షలకు పైగానే టికెట్ల సేల్ జరగడం విశేషం.
తెలుగులోనే కాక.. కన్నడ, హిందీలోనూ ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. సినిమాలో పతాక సన్నివేశాలు చూసి జనం ఊగిపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా వాటి గురించి పెద్ద చర్చ జరుగుతోంది. చూస్తుంటే సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని.. ఫుల్ రన్లో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందని అర్థమవుతోంది. ‘మహావతార నరసింహ’ను తెలుగు రాష్ట్రాల్లో అల్లు అరవింద్ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం.
This post was last modified on July 27, 2025 7:04 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…