Movie News

రాక్షసుల ‘కింగ్డమ్’లో రారాజు పోరాటం

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన కింగ్డమ్ జూలై 31 విడుదలకు రెడీ అవుతోంది. నిన్న తిరుపతిలో ఘనంగా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. చెప్పిన టైం కన్నా బాగా ఆలస్యంగా యూట్యూబ్ లోకి వచ్చిన కంటెంట్ కోసం అభిమానులు తెగ ఎదురు చూశారు. ది ఫ్యామిలీ స్టార్ తర్వాత ఏడాది పైగా గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. అందులోనూ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అయిదేళ్ళు ఈ ప్రాజెక్టు కోసం కష్టపడ్డాడంటే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి కథ దాచే ప్రయత్నం చేయకుండా స్పష్టంగా రివీల్ చేశారు.

సూరి (విజయ్ దేవరకొండ)  సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక సీక్రెట్ మిషన్ కోసం తన ఉనికిని మార్చుకుని, కుటుంబాన్ని వదులుకుని శ్రీలంక వెళ్లాల్సి వస్తుంది. ఎవరినైతే తాను పట్టుకోవాలనే లక్ష్యంతో వెళ్ళాడో, జైల్లో అతను కరుడు గట్టిన రాక్షస నాయకుడు శివ (సత్యదేవ్) స్వయానా తన అన్నయ్యని తెలుస్తుంది. అయితే ఈ నిజం బయటపెట్టకుండా తన పని మొదలుపెడతాడు సూరి. శివ అలా ఎందుకు మారాడు, అక్కడ రాక్షసుల్లాంటి మనుషులను కట్టడి చేసే ప్రయత్నంలో సూరి లీడర్ గా ఎలా మారాడు అనేది కింగ్డమ్ ప్రపంచంలో చూడాలి. ఇదంతా పీరియాడిక్ సెటప్ లో వెనుకటి కాలంలో జరుగుతుంది.

విజువల్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. కెజిఎఫ్, పుష్ప రేంజ్ మేకింగ్ తో గౌతమ్ తిన్ననూరి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎంటర్ టైన్మెంట్ లేకుండా ఎమోషన్, యాక్షన్ మీద దృష్టి పెట్టి విజయ్ దేవరకొండని లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ తో చూపించిన తీరు కొత్తగా ఉంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ షో కాకుండా ఈసారి పెర్ఫార్మన్స్ దక్కించుకుంది. సత్యదేవ్ స్పెషల్ ప్యాకేజ్ కాబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఎప్పటిలాగే మంచి ఎలివేషన్ ఇచ్చింది. స్టోరీ పరంగా ఇప్పటిదాకా ఉన్న సస్పెన్స్ వీగిపోయింది. థియేటర్లలో సూరి చూపించబోయే విశ్వరూపం ఎలా ఉండబోతోందో జూలై 31 తేలనుంది.

This post was last modified on July 27, 2025 9:03 am

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

25 minutes ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

8 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

8 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

9 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

9 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

10 hours ago