Movie News

హీరోగా యువ దర్శకుడు, షూటింగ్ ఎప్పుడంటే…

ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ల‌లో లోకేష్ క‌న‌క‌రాజ్ ఒక‌డు. మాన‌గ‌రం అనే హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన అత‌ను.. ఖైదీ మూవీతో స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. త‌ర్వాత అత‌ను తీసిన మాస్ట‌ర్ ఓ మోస్త‌రుగా ఆడ‌గా.. విక్ర‌మ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. త‌ర్వాతి చిత్రం లియో అంచ‌నాల‌ను అందుకోక‌పోయినా లోకేష్ క్రేజ్ అయితే త‌గ్గ‌లేదు. త‌న కొత్త సినిమా కూలీకి మామూలు హైప్ లేదు. లోకేష్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల లిస్ట్ పెద్ద‌దే. ఖైదీ-2, విక్ర‌మ్=2, రోలెక్స్ చిత్రాల‌తో పాటు ఆమిర్ ఖాన్‌తో సైతం ఒక సినిమాను ప్లాన్ చేశాడు. ద‌ర్శ‌కుడిగా ఇంత బిజీగా ఉన్న అత‌ను.. హీరోగా కూడా అరంగేట్రం చేయ‌బోతున్నాడు. ప్రాప‌ర్ క‌మర్షియ‌ల్ సినిమాతోనే తాను హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు అత‌ను వెల్ల‌డించాడు.

కీర్తి సురేష్‌తో సాని కాయితం, ధ‌నుష్‌తో కెప్టెన్ మిల్ల‌ర్ సినిమాలు తీసిన అరుణ్ మాథేశ్వ‌ర‌న్‌.. లోకేష్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌నున్నాడ‌ట‌. వీరి క‌ల‌యిక‌లో రాబోయేది గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ అట‌. అందులో హీరో పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా ఆల్రెడీ ప్రిప‌రేష‌న్ మొద‌లుపెట్టిన‌ట్లు ఒక ఇంట‌ర్వ్యూలో లోకేష్ వెల్ల‌డించాడు. కెప్టెన్ మిల్ల‌ర్ త‌ర్వాత అరుణ్‌.. ధ‌నుష్‌తో ఇళ‌య‌రాజా బ‌యోపిక్ చేయాల్సింది. కానీ ఆ సినిమా ఆల‌స్యం అవుతుండ‌డంతో దాని కంటే ముందు లోకేష్ హీరోగా సినిమా చేయ‌నున్నాడ‌ట‌.

ఈ సినిమా కోసం తాను బ‌రువు త‌గ్గి, కండ‌లు పెంచ‌డంతో పాటు గ‌డ్డం కూడా పెంచుతున్న‌ట్లు లోకేష్ వెల్ల‌డించాడు. తాను ఖైదీ-2 సినిమా మొద‌లుపెట్ట‌డానికి 8 నెల‌లు ప‌డుతుంద‌ని.. ఆ సినిమాకు స్క్రిప్టు రెడీగా ఉంద‌ని.. ఈలోపు హీరోగా సినిమాను పూర్తి చేస్తాన‌ని లోకేష్ తెలిపాడు. లోకేష్ ఇప్ప‌టికే శ్రుతి హాస‌న్‌తో క‌లిసి ఇనిమేల్ అనే మ్యూజిక్ వీడియోలో న‌టించాడు. అందులో త‌న లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, హావ‌భావాలు బాగానే అనిపించాయి. న‌టుడిగా ప‌నికొస్తాడ‌నే గుర్తింపు వ‌చ్చింది. ఇప్పుడు ఏకంగా ఫీచ‌ర్ ఫిలిం హీరో అయిపోతున్నాడు. దర్శ‌కుడిగా ఉన్న క్రేజ్ హీరోగా త‌న సినిమాకు క‌లిసొస్తుంద‌ని భావిస్తున్నారు. కూలీ సినిమా ఆగ‌స్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

This post was last modified on July 26, 2025 8:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

8 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

9 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

10 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

10 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

13 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

14 hours ago