Movie News

క‌న్ఫ‌మ్‌.. ఎన్టీఆర్-నీల్ సినిమాలో టొవినో

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవంలో ఎక్కువ ప్రయోజనం పొందిన ఇండస్ట్రీ అంటే మాలీవుడ్ అనే చెప్పాలి. ఎప్పట్నుంచో గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నప్పటికీ.. మలయాళం ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది, అక్క‌డి న‌టుల‌కు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఫేమ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో కేవ‌లం ఓటీటీల ద్వారా వ‌చ్చిన మ‌ల‌యాళ సినిమాల‌తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు టొవినో థామ‌స్. ఆహా సహా పలు ఓటీటీల ద్వారా అతడి సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. 2018, ఏఆర్ఎం లాంటి సినిమాలకు థియేటర్లలోనూ ఆదరణ దక్కడానికి ఈ ఫాలోయింగే కారణం.

ఇప్పుడు అత‌ను తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టేస్తున్నాడు. అది కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాతో కావ‌డం విశేషం. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ న‌టిస్తున్న డ్రాగ‌న్ (వ‌ర్కింగ్ టైటిల్) చిత్రంలో టొవినో న‌టిస్తున్న‌ట్లు ఇంత‌కుముందే రూమ‌ర్లు వ‌చ్చాయి. ఇప్పుడా విష‌యం అధికారికం అయింది. ఈ విష‌యాన్ని మ‌రో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డం విశేషం.

డ్రాగ‌న్ సినిమాలో టొవినోతో పాటు మ‌రో ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు బిజు మీన‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు పృథ్వీరాజ్ వెల్ల‌డించాడు. వీళ్లిద్ద‌రి ప్ర‌తిభ‌కు త‌గ్గ‌ట్లే ప్ర‌శాంత్ అదిరిపోయే రోల్స్ ఇచ్చి ఉంటాడ‌ని భావిస్తున్నాన‌ని.. వాళ్ల పాత్ర‌లు సినిమాకు అసెట్ అవుతాయ‌ని అత‌న‌న్నాడు. బిజు మీన‌న్ ఇప్ప‌టికే తెలుగులో ర‌ణం సినిమా చేశాడు. కానీ అప్ప‌టికి అత‌నంత పాపుల‌ర్ కాదు. కానీ ఇప్పుడు గొప్ప న‌టుడిగా ఎదిగాడు. ఇక టొవినో టాలెంట్ ఎలాంటిదో తెలిసిందే. కాబ‌ట్టి వీళ్ల పాత్ర‌లు సినిమాలో హైలైట్ అవుతాయ‌న‌డంలో సందేహం లేదు.

ఇక పృథ్వీరాజ్.. స‌లార్-2 సినిమా గురించి కూడా ఈ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు. స‌లార్ కంటే స‌లార్‌-2 చాలా పెద్దగా, ఇంకా బ‌లంగా ఉంటుంద‌ని అత‌ను చెప్పాడు. త‌న‌కు, ప్ర‌భాస్‌కు మ‌ధ్య భారీపోరు ఉంటుంద‌ని.. ఆ సినిమాను ఎప్పుడెప్పుడు మొద‌లుపెడ‌దామా అని ఎదురు చూస్తున్నాన‌ని పృథ్వీరాజ్ అన్నాడు. ముందు స‌లార్‌ను ఒక సినిమాగానే చేయాల‌నుకున్నార‌ని.. త‌ర్వాత అది రెండు భాగాలైంద‌ని.. త‌న‌కు ఈ సినిమాలో ఇంత పెద్ద రోల్ ఉన్నా ప్ర‌భాస్‌ ఓకే చెప్ప‌డం చూసి తాను ఆశ్చ‌ర్య‌పోయాన‌ని ప‌థ్వీరాజ్ వ్యాఖ్యానించాడు.

This post was last modified on July 26, 2025 8:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్…

2 hours ago

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

4 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

7 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

9 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

11 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

12 hours ago