యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్ ,హ్యుమర్ అన్నీ మిక్స్ చేసిన స్పై డ్రామా ‘చైనా పీస్’ టీజర్ అదిరిపోయింది.
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా, అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ పై నిర్మించారు. కమల్ కామరాజు, రఘు బాబు లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయగా… ఇప్పుడు వచ్చిన టీజర్ అయితే అదే బజ్‌ను ఇంకో లెవెల్‌కి తీసుకెళ్లింది.
దాదాపు 2 నిమిషాల నిడివిగల ఈ టీజర్ యాక్షన్, సస్పెన్స్, కామెడీ, డ్రామా అన్ని మిక్స్ చేసిన పక్కా ఎంటర్‌టైనర్ అనిపించింది.
దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించిన టాప్ సీక్రెట్ డేటా శత్రువుల చేతికి ఎలా చిక్కిందో… దాన్ని తిరగదొంగిలించడానికి జరుగుతున్న మిషన్ ఎలా సాగుతుందో టీజర్ లో చూపించిన తీరు థ్రిల్లింగ్ గా ఉంది.
నిహాల్ పాత్ర ఓ మామూలు కుర్రాడిలా ప్రారంభమవుతుంది. కాని ఓ ట్విస్టుతో అతడిని టెర్రరిస్ట్‌గా కస్టడీలోకి తీసుకోవడం, అక్కడి నుంచి మొదలయ్యే కథ కట్టి పడేస్తుంది.
నిహాల్ శ్రీశ్రీ కవితని తెలుగు-ఉర్దూ మిక్స్ చేసి చెప్పే సీన్… టెన్షన్ మధ్యన కూడా నవ్వు తెప్పిస్తుంది.
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కమల్ కామరాజు యాక్టింగ్, రఘు బాబు టైమింగ్ కూడా టీజర్ లోనే ఆకట్టుకుంటున్నాయి.
దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి తీసుకున్న కాన్సెప్ట్, చెప్పిన విధానం చూసి యూనిక్ గా వున్నాయి. గ్రాండుగా కనిపించే ప్రొడక్షన్ వాల్యూస్, ఇంటెన్స్ బీజీఎమ్, స్టైలిష్ విజువల్స్ అన్నీ కలిపి ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మొత్తానికి చైనా పీస్ టీజర్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూసేలా చేసింది.
This post was last modified on July 26, 2025 4:50 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…