సలార్, ఎస్ఎస్ఎంబి 29 విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించిన సర్జమీన్ నిన్న విడుదలయ్యింది. అయితే థియేటర్లలో కాదులెండి. నేరుగా ఓటిటి ద్వారా జియో హాట్ స్టార్ లో వచ్చేసింది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో పాటు సీనియర్ హీరోయిన్ కాజోల్ అతని తల్లిగా ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. ఎప్పుడో షూటింగ్ పూర్తయినా రిలీజ్ కు చాలా టైం పట్టింది. ముందు థియేటర్ అనుకున్నారు. తర్వాత రకరకాల విశ్లేషణలు, చర్చల తర్వాత ఫైనల్ గా డిజిటల్ కు మొగ్గు చూపారు. అత్తారింటికి దారేదిలో పవన్ తాతగా నటించిన బోమన్ ఇరానీ కొడుకు కయోజ్ ఇరానీ సర్జమీన్ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు.
కథ పరంగా చూసుకుంటే అప్పుడెప్పుడో వచ్చిన సంజయ్ దత్ – హృతిక్ రోషన్ ‘మిషన్ కాశ్మీర్’ ఛాయలు చాలా కనిపిస్తాయి. కల్నల్ విజయ్ మీనన్ (పృథ్విరాజ్ సుకుమారన్ ) కొడుకు హర్మన్ (ఇబ్రహీం) కు సైన్యంలో చేరాలని లక్ష్యంగా ఉంటుంది. అయితే అతని నత్తి శాపంగా నిలుస్తుంది. ఓసారి తీవ్రవాదులు హర్మన్ ని కిడ్నాప్ చేస్తారు. బెదిరింపులకు పాల్పడినా దేశం కోసం విజయ్ వాళ్ళను లొంగడు. కొన్ని సంవత్సరాలు గడిచాక హర్మన్ తిరిగి ఇంటికి వస్తాడు. అక్కడి నుంచి తండ్రి కొడుకులతో తల్లి (కాజోల్) మానసిక సంఘర్షణ మొదలవుతుంది. ఇన్నేళ్లు హర్మన్ ఏమయ్యాడు, తిరిగి వచ్చాక ఏం జరిగిందనేది స్టోరీ.
పోస్టర్లు, ట్రైలర్ చూసి ఇదేదో యాక్షన్ ప్లస్ ఎమోషన్ ఎంటర్ టైనర్ అనుకుంటాం కానీ దర్శకుడు కయోజ్ ఎక్కువ భావోద్వేగాలకు పరిమితమయ్యాడు. దీని వల్ల నెరేషన్ నెమ్మదిగా సాగి చాలా సీన్లు బోర్ కొట్టిస్తాయి. మొదటి ఇరవై నిముషాలు, హర్మన్ తిరిగి వచ్చాక జరిగే కొన్ని ఎపిసోడ్లు పర్వాలేదనిపిస్తాయి కానీ మొత్తంగా ఫార్వార్డ్ చేయకుండా చూడటం కష్టమనిపిస్తుంది. నిర్మాత కరణ్ జోహార్ బాగానే ఖర్చు పెట్టారు. కాకపోతే ఆయన్ను అంతగా మెప్పించిన కథ ఇందులో ఏముందనే సందేహం కలుగుతుంది. సర్జమీన్ చూసేందుకు చాలా ఓపిక కావాలి. ఒకరకంగా థియేటర్ స్కిప్ చేయడం మంచే చేసింది.
This post was last modified on July 26, 2025 2:44 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…