హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉన్నా శ్రీలీల అవకాశాలకు ఎలాంటి ఢోకా లేకుండా పోతోంది. మాములుగా సక్సెస్ ని ప్రామాణికంగా తీసుకునే ఇండస్ట్రీలో దాన్ని పట్టించుకోకుండా ఆఫర్లు వచ్చేలా చేసుకోవడం శ్రీలీలకే చెల్లింది. ఈ ఏడాది తను బాలీవుడ్ డెబ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఆషీకీ 3 (ప్రచారంలో ఉన్న టైటిల్) తో పెద్ద ఎంట్రీనే దక్కించుకుంది. దీని షూటింగ్ కోసమే ముంబైలో ఎక్కువగా ఉంటున్న శ్రీలీల ఇది తనకు పెద్ద బ్రేక్ అవుతుందనే అంచనాలో ఉంది. ఇటీవలే సైయారా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఈ మూవీ మీద మంచి హైప్ నెలకొంది.
ఇదింకా నిర్మాణంలో ఉండగానే శ్రీలీల మరో క్రేజీ మూవీ దక్కించుకుందని ముంబై టాక్. రణ్వీర్ సింగ్ హీరోగా నటించబోయే భారీ యాక్షన్ మూవీలో ఆమెను లాక్ చేసుకున్నట్టు సమాచారం. ఓపెనింగ్ రోజు అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. ఇందులో విలన్ గా బాబీ డియోల్ నటించబోతున్నాడు. అయితే ఇది ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు డాన్ 3నా లేక వేరొకటా అనేది తెలియాల్సి ఉంది. తెలుగులో ఆఫర్లకు లోటు లేకపోయినా శ్రీలీలను ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి. ఇటీవలే కిరీటి జూనియర్ సైతం ఫ్లాప్ లిస్టులోకి చేరిపోయింది. డాన్సులకు పేరొస్తోంది కానీ పెర్ఫార్మన్స్ దక్కడం లేదు.
శ్రీలీల బాలీవుడ్ మీద ఇంత ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం లక్కీగా నటనకు స్కోప్ ఉన్నవి దక్కడమే కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా కార్తీక్ ఆర్యన్ మూవీలో ప్రియురాలిగా చాలా డెప్త్ ఉన్న షేడ్స్ ఉన్నాయట. వాటి ద్వారా ఆమెలో ఎంత నటి దాగి ఉందో పరిశ్రమకు అర్థమవుతుందని యూనిట్ వర్గాల మాట. మసాలా డాన్సులు, హంగులు హంగామాలు లేకుండా స్వచ్ఛమైన ప్రేమను చూపించేలా అనురాగ్ బసు ఈ సినిమా తీస్తున్నారని తెలిసింది. ఇక రణ్వీర్ సింగ్ లాంటి పవర్ హౌస్ పక్కన నటించడం కూడా ఒక రకంగా జాక్ పాట్ లాంటిది. ఇవి క్లిక్ అయితే హిందీలోనూ శ్రీలీల బిజీ అయిపోవచ్చు.
This post was last modified on July 26, 2025 11:27 am
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…