జూలై ఆఖరి వారం వచ్చేస్తోంది. కింగ్డమ్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఒకవేళ హరిహర వీరమల్లు కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే థియేటర్ కౌంట్, ఓపెనింగ్స్ పరంగా కొంచెం టెన్షన్ ఉండేది కానీ బాక్సాఫీస్ వద్ద పరిస్థితి చూస్తుంటే ఆ ఆందోళన అక్కర్లేదనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అద్భుతాలు చేయడం డౌట్ గానే ఉంది. రెండో రోజే ఆక్యుపెన్సీలు తగ్గిపోవడం అభిమానులను ఖంగారుకు గురి చేస్తుండగా బయ్యర్ల ఆశలన్నీ వీకెండ్ మీద ఉన్నాయి. టాక్ కి తోడు ఏపీలో అధికంగా ఉన్న టికెట్ రేట్లు వసూళ్ల మీద చూపిస్తున్న ప్రభావాన్ని నిర్మాతలు సీరియస్ గా తీసుకుంటే పరిస్థితి కొంచెం మెరుగవ్వొచ్చు.
ఇప్పుడీ అవకాశాన్ని మార్చుకునే దిశగా కింగ్గమ్ గేర్లు మారుస్తోంది. నిన్న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి వంగా మీద షూట్ చేసిన ప్రత్యేక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూని రిలీజ్ చేశారు. వీడియోలు అప్పుడే వైరలవుతున్నాయి. ఇవాళ రాబోయే ట్రైలర్ మీద చాలా అంచనాలున్నాయి. ఓపెనింగ్స్ కి ఇది చాలా కీలకం కానుంది. ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేయడం గురించి నిర్మాత నాగవంశీ ఇంకా ఆలోచనలో ఉన్నారు తప్ప నిర్ణయం తీసుకోలేదు. బుధవారం స్పెషల్ షోలు రిస్క్ గా మారుతున్న తరుణంలో తొందరపడకూడదనే ఉద్దేశంతో ఎగ్జిబిటర్ వర్గాలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
రాబోయే వారం రోజులు కింగ్డమ్ కు కీలకం కాబోతున్నాయి. ప్యాన్ ఇండియా రిలీజ్ కావడంతో ఇతర బాషల మార్కెట్లను నిర్లక్ష్యం చేయకుండా పబ్లిసిటీ ఎలా డిజైన్ చేయాలనే దాని మీద దృష్టి పెడుతున్నారు. హిందీలో సామ్రాజ్యగా రిలీజ్ కాబోతున్న కింగ్డమ్ కు అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. అన్నయ్యగా సత్యదేవ్, హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో పోలీసుగా, అణుగారిన వర్గాలకు నాయకుడిగా విజయ్ దేవరకొండ చాల ఇంటెన్స్ పాత్ర పోషిస్తున్నాడు. రెండు వారాల్లోనే సేఫ్ అయ్యే టార్గెట్ పెట్టుకున్న కింగ్డమ్ కు ఆగస్ట్ 14 కూలి, వార్ 2 ఒకేరోజు బ్రేక్ వేయబోతున్నాయి.
This post was last modified on July 26, 2025 11:15 am
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…