Movie News

సినిమాలు మానేశాక క్యాబ్‌డ్రైవర్‌గా..

సినిమాలు మానేశాక ఏం చేస్తారు అని అడిగితే.. ఏదైనా బిజినెస్ చేస్తాం అంటారు నటులు. కానీ మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ రూటే వేరు. అతను క్యాబ్ డ్రైవర్‌గా మారతానని అంటున్నాడు. ఈ మాట అతను చెప్పడం తొలిసారి కాదు. గతంలోనూ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పి ఆశ్చర్యపరిచాడు. అతను సరదాగా ఈ మాట అంటున్నాడేమో అనుకుంటే.. అదేమీ కాదని, ఆ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాడని అర్థమవుతోంది. తాను రిటైరయ్యాక క్యాబ్ డ్రైవర్‌గా మారతానని ఫాహద్ మరోసారి నొక్కి వక్కాణించాడు.

ఐతే అతను డ్రైవర్ అయ్యేది ఇండియాలో కాదట. స్పెయిన్‌లోని బార్సిలోనానట. ప్రపంచంలో తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అదేనని.. అక్కడ క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తాలనుకుంటున్నానని ఫాహద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక చాల్లే చూడలేకపోతున్నాం.. అని ప్రేక్షకులు తన విషయంలో అనుకున్న రోజు తాను నటన మానేస్తానని ఫాహద్ తెలిపాడు. తాను పలుమార్లు బార్సిలోనా వెళ్లానని.. కొన్ని నెలల ముందు కూడా భార్యతో కలిసి ఆ నగరాన్ని సందర్శించానని ఫాహద్ వెల్లడించాడు.

ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశమైన బార్సిలోనాలో ఉబర్ డ్రైవర్‌గా పని చేయాలన్నది తన కోరిక అని అతను చెప్పాడు. ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చడాన్ని మించిన ఆనందం ఏముంటుందని అతను చెప్పాడు. అందుకే రిటైరయ్యాక బార్సిలోనాలో ఉబర్ డ్రైవర్‌గా మారి అక్కడే కాలం గడుపుతానని ఫాహద్ వెల్లడించాడు. డ్రైవింగ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఎప్పుడూ బోర్ కొట్టని పని అదని ఫాహద్ చెప్పాడు. ఫాహద్ తమిళంలో వడివేలుతో కలిసి నటించిన ‘మారీశన్’ ఈ వీకెండ్లో రిలీజై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది.

This post was last modified on July 25, 2025 7:27 pm

Share

Recent Posts

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…

2 hours ago

లెక్క తప్పిన చుక్క చిత్రాలు… ఇమేజ్ మీద మరకలు

భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…

3 hours ago

సెక్యూరిటీ లేకుండా వెళ్లి చంద్రబాబుతో పవన్ ఏం చెప్పారు?

సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…

3 hours ago

అర్జునుడి కష్టాలు పేరుకి తగ్గట్టే ఉన్నాయి

తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…

4 hours ago

ప్రశాంత్ నీల్ బ్రాండ్ మహత్యం ఇది

కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…

5 hours ago

సంజూ మొదలెట్టాడు… నమన్ ధీర్ ముగించాడు!

225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…

5 hours ago