భారీ పారితోషకాలు, సకల సౌకర్యాల సంగతెలా ఉన్నప్పటికీ సినిమాల కోసం హీరోల కష్టం తక్కువేమీ కాదు. పాత్రల కోసం అవతారాలు మార్చుకోవడం, ఫిజిక్ మెయింటైన్ చేయడం.. ఇబ్బందికర పరిస్థితుల మధ్య షూటింగ్ చేయడం.. పాత్రల కోసం హోం వర్క్ చేయడం.. ఇలా చాలా వ్యవహారాలే ఉంటాయి. హీరోలకు సంబంధించి ప్రతి విషయాన్నీ నిశితంగా గమనిస్తారు, సినిమాలు సేల్ అయ్యేదే వాళ్ల పేరు మీద కాబట్టి వాళ్లు ఎంతో జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
కొన్ని నెలల పాటు ఎక్కడలేని ఏకాగ్రతతో నిర్విరామంగా పని చేసి బాగా స్ట్రెస్ అవుతుంటారు హీరోలు. అంత కష్టపడి సినిమా పూర్తి చేశాక చిల్ అవడం కోసం సన్నిహితులతో పార్టీల్లో మునిగితేలుతుంటారు. పెళ్లిళ్లు అయిన హీరోలు సైతం చాలా మంది స్నేహితులతో చిల్ అవడానికే చూస్తారు. పార్టీల మీద పార్టీలు చేసుకుంటారు. కానీ మహేష్ బాబు మాత్రం ఇందుకు భిన్నం.
టాలీవుడ్లో వేరే హీరోలు కూడా కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారు కానీ.. మహేష్ బాబు స్థాయిలో మాత్రం ఫ్యామిలీ కమిట్మెంట్ చూపించే వాళ్లు ఇంకొకరు కనిపించరంటే అతిశయోక్తి కాదు. మహేష్ వేరే వాళ్లతో చిల్ కావడం అరుదు. కొన్ని ఆబ్లిగేషన్ల మీద తన సినిమాల సక్సెస్ పార్టీల్లో వేరే వాళ్లతో కనిపించాడేమో కానీ.. మహేష్‌కు రిలాక్సేషన్ అంటే ఫ్యామిలీతోనే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే.. సినిమా మొదలవడానికి ముందు, పూర్తయ్యాక ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లాల్సిందే. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ.
కరోనా టైంలో పూర్తిగా ఇంటి పట్టున కుటుంబంతో గడిపిన మహేష్.. త్వరలో తన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ను మొదలుపెట్టనున్న నేపథ్యంలో భార్యా పిల్లలతో కలిసి ఆనవాయితీ ప్రకారం వెకేషన్‌కు వెళ్లొచ్చేశాడు. ఎప్పుడూ మహేష్‌ను వెకేషన్లో ఫ్యామిలీతో కలిపి జనాలకు బోర్ కొట్టేస్తుండొచ్చు. కానీ అతను మాత్రం తనకు కుటుంబాన్ని మించిన ఆనందం లేదన్నట్లుగా తన ఆనవాయితీని కొనసాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోల్లో బెస్ట్ ‘ఫ్యామిలీ మ్యాన్’ మహేషే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on November 19, 2020 5:05 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…