పవన్ కళ్యాణ్ ప్యాన్ ఇండియా గ్రాండియర్ మార్కెట్ లో ఉన్నప్పుడు దానికి పోటీ ఉన్న సినిమా రేస్ లోకి రావడం ఊహించామా. అది కూడా యానిమేషన్ మూవీ ఎఫెక్ట్ చూపించడం చాలా అరుదు. ఇవాళ విడుదలైన మహావతార్ నరసింహకు బుక్ మై షోలో గంటకు 4 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతూ ట్రెండింగ్ లో రావడం అనూహ్యం. నిజానికి దీని మీద పెద్దగా బజ్ లేదు. కెజిఎఫ్, సలార్ నిర్మాతలు హోంబాలె ఫిలింస్ సమర్పించిన ఈ సిరీస్ లో విష్ణు అవతారాలను ఒక్కొక్కటిగా తెరమీద తీసుకొచ్చేందుకు భారీ బడ్జెట్ కేటాయించారు. హై క్వాలిటీ విజువల్స్ తో ఆడియన్స్ కి థ్రిల్ ప్లస్ డివోషన్ ఇచ్చేలా తీస్తున్నారు.
మహావతార్ నరసింహ మనకు తెలియని కథ కాదు. భక్త ప్రహ్లాదుడి మొరవిని స్థంభం నుంచి బయటికి వచ్చిన నరసింహావతారం రాక్షస రాజు హిరణ్యకశిపుడిని అంతమొందించే గాథని ఎన్నోసార్లు చదువుకున్నాం, సినిమాల్లో చూసుకున్నాం. 1967లో వచ్చిన భక్త ప్రహ్లాద తర్వాత మళ్ళీ ఎవరూ ఆ ప్రయత్నం చేయలేదు. ఆ క్లాసిక్ ని మరిపించే స్థాయిలో రీ క్రియేట్ చేయలేమని భావించి దర్శక నిర్మాతలు ఆలోచన మానుకున్నారు. రానా కృష్ణం వందే జగద్గురుంలో క్లైమాక్స్ ఫైట్ మొత్తం ఈ నరసింహావతారం మీదే నడుస్తుంది. మణిశర్మ ఇచ్చిన బీజీఎమ్, పాట దాన్నో గొప్ప ఎండింగ్ గా నిలిపాయి.
ఇక మహావతార్ నరసింహాకు విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ప్రత్యక ప్రశంసలు అందుతున్నాయి. కిరణ్ అబ్బవరం క, పుష్ప 2లో కొంత భాగానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సామ్ సిఎస్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. లైవ్ యాక్టర్స్ లేకపోయినా యానిమేషన్ తో నిజమైన పాత్రలను చూస్తున్న అనుభూతి కలిగించడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా తొలి అరగంట, క్లైమాక్స్ మిస్ కాకూడదనేంత గొప్పగా వచ్చాయి. దర్శకుడు అశ్విన్ కుమార్ విజన్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడమని కాదు కానీ ఇదే ట్రెండ్ కొనసాగితే మహావతార్ హిట్టు కొట్టేలానే ఉంది.
This post was last modified on July 25, 2025 6:47 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…