టాలీవుడ్లో చాన్నాళ్ల తర్వాత ఓ భారీ చిత్రం థియేటర్లలోకి దిగుతోంది. అదే.. హరిహర వీరమల్లు. మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర హంగామా మామూలుగా ఉండదు. పైగా ఇది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం. ఏడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న స్ట్రెయిట్ మూవీ. అందులోనూ ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన, హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న భారీ చిత్రం. కొన్ని రోజుల ముందు వరకు ఈ చిత్రానికి హైప్ తక్కువగానే ఉంది కానీ… ఇప్పుడు కథ మారింది. పవన్ సినిమాల విషయంలో అదే జరిగేది. ముందు అభిమానులు పెద్దగా ఆసక్తి లేనట్లు కనిపిస్తారు. రిలీజ్ దగ్గర పడేసరికి ఊగిపోతారు. ‘హరిహర వీరమల్లు’కు కూడా ముందు రోజు మంచి హైప్ కనిపిస్తోంది.
బుధవారం రాత్రి సెకండ్ షో నుంచే ‘హరిహర వీరమల్లు’ హంగామా మొదలు కాబోతోంది. తొలి రోజుకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. దీంతో తొలి రోజు ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందన్నదానిపై అందరి దృష్టీ నిలిచి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన చిత్రం.. వకీల్ సాబ్. దీని తర్వాత వచ్చిన ‘భీమ్లా నాయక్’కు ఇంకా హైప్ వచ్చినప్పటికీ.. ఏపీలో టికెట్ల రేట్లు బాగా తగ్గించేయడంతో ఆ రికార్డును కొట్టలేకపోయింది. ‘బ్రో’ మూవీలో పవన్ చేసింది అతిథి పాత్ర కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోలేం.
మరి ‘హరిహర వీరమల్లు’ డే-1 ఎంత కలెక్ట్ చేస్తుందన్నది ఆసక్తికరం. బుకింగ్స్ లేటుగా మొదలు కావడం.. తెలంగాణలో స్క్రీన్ల విషయంలో గందరగోళం తలెత్తడం వంటి అంశాలు కొంత ప్రతికూలం కావచ్చు. కానీ ముందు రోజు పెద్ద ఎత్తున ప్రిమియర్స్ వేస్తుండడం.. వాటి టికెట్ల ధరలు రూ.600-700 మధ్య ఉన్న నేపథ్యంలో ఓవరాల్ కలెక్షన్లకు ఇది పెద్ద ప్లస్ అవుతుంది. ఈ ప్రిమియర్లను కూడా కలుపుకుంటే తొలి రోజు ఈ చిత్రం ‘వకీల్ సాబ్’ వసూళ్లను దాటే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే హైప్ పెరిగి రూ.50 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశాలున్నాయి.
This post was last modified on July 24, 2025 10:35 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…