Movie News

టామ్ అండ్ జెర్రీ ప్రియులకు శుభవార్త

టామ్ అండ్ జెర్రీ.. ఈ పేరు వినగానే ముఖాల్లో ఒక చిరునవ్వు పులుముకుంటుంది జనాల్లో. దశాబ్దాలుగా ఈ రెండు పాత్రలు ప్రపంచవ్యాప్తంగా వినోద ప్రియుల్ని ఎంతగా అలరిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కాన్సెప్ట్ ఏమీ ఉండదు.

ఎలకను పట్టుకునేందుకు పిల్లి చేసే ప్రయత్నాలు.. దాన్ని ముప్పు తిప్పలు పెడుతూ ఎలక చేసే విన్యాసాలు.. ఇదే కాన్సెప్ట్ మీద ఎంతో సృజనాత్మకతతో.. అద్భుత రీతిలో వినోదాన్ని పండిస్తూ దశాబ్దాలుగా ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ ఫిల్మ్ సిరీస్ మేకర్స్. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఎపిసోడ్లవి. ఇప్పుడు కూడా ఎక్కడైనా టీవీలో టామ్ అండ్ జెర్రీ సీన్స్ కనిపిస్తే ఆగి అలా చూస్తూ ఉండిపోతాం. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరినీ అలరించే సిరీస్ అది. ఇప్పుడు ఆ సిరీస్ వెండితెరకు ఎక్కడం విశేషం.

వార్నర్ బ్రదర్స్ సంస్థ టామ్ అండ్ జెర్రీ పాత్రలతో ఒక సినిమా తీసింది. దాని పేరు కూడా.. టామ్ అండ్ జెర్రీనే. ఫీచర్ ఫిలింకు యానిమేటెడ్ క్యారెక్టర్స్, సన్నివేశాలు జోడించి ఈ సినిమాకు భారీతనం చేకూర్చింది. ఒక ఇంట్లో పెళ్లి వేడుకకు సిద్ధమవుతున్న వేళ.. ఆ ఇంటి వారికి తలనొప్పిగా మారిన ఎలకను పట్టుకునేందుకు పిల్లిని తీసుకొస్తారు. ఇక ఆ పిల్లి, ఎలకల మధ్య జరిగే వార్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది.

మామూలుగా టామ్ అండ్ జెర్రీ సిరీస్‌లో చూసే సన్నివేశాలకే భారీతనం తీసుకొచ్చి వెండితెరపై ఇంకా అద్భుతంగా ప్రెజెంట్ చేశారని దీని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్లోనే కొన్ని సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించేలా ఉన్నాయి. టామ్‌ను జెర్రీ ఆటాడుకునే సన్నివేశాలు వావ్ అనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు పూర్తి స్థాయిలో నడవడం మొదలయ్యాక ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తోంది వార్నర్ బ్రదర్స్ సంస్థ.

This post was last modified on November 19, 2020 5:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

42 minutes ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

48 minutes ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

1 hour ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

2 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

3 hours ago