Movie News

జులై 25… OTT కంటెంట్ చాలా ఉంది

ఈ వారం బిగ్గెస్ట్ రిలీజ్ ‘హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’కు టికెట్లు దొరక్కపోతే ఎలా అనే చింత అక్కర్లేదు అనేలా ఉన్నాయి ఓటిటి కంటెంట్లు. ప్రతివారం థియేటర్ తో పోటీ పడుతున్న డిజిటల్ విడుదల్లో ఈ జూలై 25 శుక్రవారం క్రేజీ సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ కు రివ్యూలలో మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ టైటిల్ కనెక్ట్ కాకపోవడం, మార్కెటింగ్ చేయకపోవడం లాంటి కారణాల వల్ల ఎక్కువ ఆడియన్స్ కి చేరలేదు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీ పైకి రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ లా కనిపించినా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ థ్రిల్ ఇస్తాయి.

నవీన్ చంద్ర హీరోగా వచ్చిన ‘షో టైం’కి క్రిటిక్స్ లో మంచి స్పందన వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా నిలబడలేదు. చూసినవాళ్లను మరీ నిరుత్సాహపరచలేదనే మాటైతే వినిపించింది. సన్ నెక్స్ట్ లో చూసుకోవచ్చు. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్, సలార్ విలన్ పృథ్విరాజ్ సుకుమారన్, కాజోల్ కాంబోలో తెరకెక్కిన ‘సర్జమీన్’ తెలుగు ఆడియోతో పాటు అన్ని ప్రధాన భాషల్లో జియో హాట్ స్టార్ ద్వారా అందుబాటులోకి రానుంది.  తొలుత థియేటర్ అనుకున్నప్పటికీ నిర్మాతలు మనసు మార్చుకుని ఓటిటికి ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ లో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘మండాలా మర్డర్స్’ మీద అంచనాలు బానే ఉన్నాయి.

భారీ బడ్జెట్ తో నిర్మించిన వెబ్ సిరీస్ ‘రంగీన్’ ప్రైమ్ లో రానుంది. స్టార్ క్యాస్టింగ్ లేకపోయినప్పటికీ మగ వేశ్యగా మారిన హీరో పాత్ర చుట్టూ కొత్తగా రాసుకున్నారు. ఇవి కాకుండా రెండు రోజుల క్రితమే మలయాళం హిట్ మూవీ ‘రొంత్’ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. సోషల్ మీడియాలో కాంప్లిమెంట్స్ బాగానే వస్తున్నాయి. ఇవి కాకుండా హాలీవుడ్ సినిమాలు చాలానే ఈ రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్నాయి. సో  ఇంట్లోనే కాలక్షేపం చేసుకోవడానికి బోలెడంత వినోదం అందుబాటులోకి వస్తోంది. ఓటిటి పరిధి పెరిగిపోయాక భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలు చేరువయ్యాయి. ఆప్షన్లు విపరీతంగా పెరిగిపోయాయి.

This post was last modified on July 23, 2025 4:06 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

2 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

4 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

4 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

6 hours ago