సెప్టెంబర్ 5 విడుదల లాక్ చేసుకున్న మిరాయ్ మళ్ళీ వాయిదా పడుతుందేమోననే ప్రచారాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇది తెలిసే అనుష్క ఘాటీ, రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ ఆ డేట్ మీద కన్నేశాయనే వార్తలు బలంగానే తిరుగుతున్నాయి. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అలాంటిదేమి లేదని చెబుతోంది. ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న లిరికల్ సాంగ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా వదలిన పోస్టర్ లో సినిమా రిలీజ్ స్పష్టంగా సెప్టెంబర్ 5 ని పేర్కొన్నారు. అంటే ఎలాంటి పోస్ట్ పోన్ లేదన్న మాట. మరి ఎందుకు ఈ రకంగా పబ్లిసిటీ జరిగిందనే కోణంలో విచారిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
మిరాయ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా టైట్ గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ క్వాలిటీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో ఫైనల్ అవుట్ ఫుట్ కి టైం పడుతోంది. కానీ ఓటిటితో చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్ రిలీజ్ సెప్టెంబర్ 5 జరిగిపోవాలి. అంతకు ముందు ప్రకటించిన రెండు డేట్లు ఏప్రిల్ 18, ఆగస్ట్ 1 రకరకాల కారణాలతో వదిలేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మూడోసారి అంటే కష్టమవుతుంది. అందుకే ఎలాగైనా టార్గెట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డే అండ్ నైట్ ఈ పనుల మీదే ఉన్నారట. ఈ నెల మినహాయిస్తే చేతిలో కేవలం 35 రోజులు మాత్రమే ఉంటుంది. ఇది చాలా అంటే చాలా తక్కువ టైం.
ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్, ప్యాన్ ఇండియా ప్రమోషన్లు ఇలా చాలా పనులున్నాయి. ఫస్ట్ కాపీ ఆగస్ట్ మూడో వారానికల్లా సిద్ధమవ్వాలి. హనుమాన్ తర్వాత తేజ సజ్జ ఏకంగా ఏడాదిన్నరకి పైగా గ్యాప్ తీసుకున్నాడు. అందుకే మిరాయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే కొంత ఆలస్యమవుతున్నా సరే రాజీ లేకుండా భారీ ఖర్చు పెట్టారు. డబ్బింగ్, ఆడియో, శాటిలైట్ కు మంచి రేట్ వస్తోందని సమాచారం. ఇదే సంస్థ నిర్మిస్తున్న ది రాజా సాబ్ కు పని చేస్తున్న నిపుణులే మిరాయ్ కి కూడా విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారట. ఇందులో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు.
This post was last modified on July 23, 2025 11:55 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…