వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. స్మార్ట్ ఫోన్, ఇంటర్ నెట్ కు అలవాటు పడి బుక్కులు చదవడమే మానుకున్న ఇప్పటి జనరేషన్ కు కాలేజీలో లైబ్రరీ ఎక్కడుందో చెప్పమంటే కాసేపు ఆలోచిస్తారు. అంతగా టెక్నాలజీ మనల్ని తినేస్తోంది. కానీ ఒక వెబ్ సిరీస్ వల్ల ఒక పుస్తకం అమెజాన్ వెబ్ సైట్ లో టాప్ సెల్లర్ గా మారడం విచిత్రమే. ఇటీవలే సోని లివ్ లో ‘ది హంట్ – రాజీవ్ గాంధీ అసాసినేషన్’ స్ట్రీమింగ్ అయ్యింది. 1991 తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో జరిగిన బాంబు దాడిలో మాజీ ప్రధాని ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. దోషులను పట్టుకునే విచారణ క్రమమే ది హంట్.
మనకూ పరిచయమున్న నగేష్ కుకునూర్ దర్శకతం వహించిన ‘ది హంట్’ని జర్నలిస్ట్ అనిరుద్యా మిత్ర రాసిన ’90 డేస్ ది ట్రూ స్టోరీ అఫ్ ది హంట్ ఫర్ రాజీవ్ గాంధీ అసాసినేషన్’ ఆధారంగా తీశారు. సిరీస్ చూసి థ్రిల్ అయిన ప్రేక్షకులు నవలలో మరింత లోతైన విషయాలు ఉంటాయని భావించి వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. దీంతో మొన్నటి దాకా ఎవరూ పట్టించుకోని ఒక పుస్తకం హఠాత్తుగా వేల కాపీలు అమ్ముడు పోవడం మొదలయ్యింది. నిజంగా సిరీస్ లో చూపించలేని కొన్ని విషయాలు బుక్కులో మరింత డీటెయిల్డ్ గా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ తాలూకు లోతులను అందులో వివరంగా పొందుపరిచారు.
ఇదే కాన్సెప్ట్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. జాన్ అబ్రహం – రాశి ఖన్నా ‘మద్రాస్ కేఫ్’లో రాజీవ్ మర్డర్ కు ముందు విషయాలను చూపిస్తుంది. కన్నడ మూవీ ‘సైనేడ్’లో రాజీవ్ గాంధీని చంపిన హంతకులు బెంగళూరు శివారులో దాక్కుంటే వాళ్ళ మీద పోలీసులు జరిపిన ఆపరేషన్ ని అద్భుతంగా చూపించారు. పాతికేళ్ల క్రితం కెమెరామెన్ సంతోష్ శివన్ ‘టెర్రరిస్ట్’ పేరుతో ఇదే కాన్సెప్ట్ ఆధారంగా ఓ సినిమా తీశారు కానీ వివాదాల వల్ల రిలీజ్ కాలేదు. ఏదైతేనేం సైకో కిల్లింగ్స్, అడల్ట్ కంటెంట్ తో నిండిపోతున్న ఓటిటిలో ఇలాంటి రియల్ లైఫ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు రావడం, అవి పుస్తకాలు కొనేలా చేయడం మంచి పరిణామమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates