ఇప్పుడంటే అందరి దృష్టి కింగ్డమ్ మీద ఉంది కానీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీసిన ఇంకో సినిమా మేజిక్ విడుదల ఎప్పుడనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. సితార బ్యానర్ లోనే రూపొందిన ఈ యూత్ ఫుల్ స్టోరీలో అంతా కొత్తవాళ్లే నటించారు. పొన్నియిన్ సెల్వన్ లో మెరిసిన సారా అర్జున్ తో పాటు అన్మోల్ కజని, ఆకాష్ శ్రీనివాస్, సిద్దార్థ్ తణుకు పరిచయమవుతున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి మొదటి లిరికెల్ సాంగ్ 5 నెలల క్రితం రిలీజయ్యింది. వచ్చినా వ్యూస్ 2 మిలియన్ల లోపే. ఇంత తక్కువ రెస్పాన్స్ అనిరుధ్ పాటలకు రావడం చాలా అరుదు.
సరే ఎందుకు పక్కన పెట్టారనేది కనుక్కుంటే మేజిక్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బ్యాలన్స్ ఉంది. కొన్ని ముఖ్యమైన కరెక్షన్లతో పాటు కొంత భాగం రీ షూట్ చేయాల్సి ఉందట. కింగ్డమ్ లో బిజీగా ఉన్న గౌతమ్ తిన్ననూరి ఆగస్ట్ లో ఫ్రీ కాబోతున్నాడు. అక్కడి నుంచి మేజిక్ పనులు చూసుకోవాలి. ట్విస్ట్ ఏంటంటే డిసెంబర్ దాకా రిలీజ్ స్లాట్స్ ఖాళీ లేవు. మంచి డేట్లన్నీ ప్యాన్ ఇండియా సినిమాలు తీసేసుకున్నాయి. సో మేజిక్ వర్కౌట్ కావాలంటే సోలో డేట్ పడాలి. కానీ ఆ ఛాన్స్ కనిపించడం లేదు. కాంపిటీషన్ లో దింపితే అనవసరంగా రన్ దెబ్బ తింటుందని నిర్మాతల అభిప్రాయం.
కింగ్డమ్ కనక బ్లాక్ బస్టర్ అయితే అది మేజిక్ కు ఉపయోగపడుతుంది. ప్యాన్ ఇండియా భాషల్లో వదలొచ్చు. అనిరుధ్ మ్యూజిక్ కాబట్టి తమిళనాడులో మద్దతు దొరుకుతుంది. కింగ్డమ్ బ్యాక్ డ్రాప్ కూడా కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే శ్రీలంక శరణార్ధులది. సో దీంతో ముందు ఋజువు చేసుకుంటే కింగ్డమ్ దర్శకుడిగా తన బ్రాండ్ మేజిక్ కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి నిర్మాత వైపు నుంచి దీని గురించి ఎలాంటి అప్డేట్ లేదు కానీ విజయ్ దేవరకొండ సినిమా రిలీజయ్యేదాకా మాట్లాడేలా లేరు. ఫుల్ యూత్ ఎలిమెంట్స్ నిండిన మేజిక్ ఇదే సంస్థలో వచ్చిన మ్యాడ్, టిజె టిల్లు రేంజ్ లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్.
This post was last modified on July 22, 2025 3:31 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…