ఈ ఏడాది ఆరంభంలో తమిళంలో ‘సైకో’ పేరుతో ఓ సినిమా వచ్చింది. విభిన్న చిత్రాల దర్శకుడు మిస్కిన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఉదయనిధి స్టాలిన్, అదితి రావు ప్రధాన పాత్రలు పోషించారు. ఒక సైకో కిల్లర్ అమ్మాయిల్ని తీసుకెళ్లి దారుణమైన రీతిలో చంపేస్తుంటాడు. హీరోయిన్ కూడా అలాగే సైకో కిల్లర్ బారిన పడుతుంది. అంధుడైన హీరో ఆమెను ఆ సైకో నుంచి ఎలా కాపాడాడన్నది ఈ చిత్ర కథ.
ఇప్పుడు సరిగ్గా ఇలాంటి కథతో మరో సినిమా తెరకెక్కింది. ఐతే ఇందులో హీరో లేడు. హీరోయినే సేవియర్. ఆమె అంధురాలు కావడం ప్రత్యేకత. ఆ పాత్రను లేడీ సూపర్ స్టార్ నయనతార పోషించడం ఈ సినిమాలో మేజర్ హైలైట్. ఆ చిత్రం పేరు.. నేత్రికన్ (తెలుగులో మూడో కన్ను అని అర్థం). బుధవారం నయన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ‘సైకో’ను మించి ఆసక్తి రేకెత్తించేలా, ఒళ్లు గగుర్పొడిచేలా టీజర్లో విజువల్స్ ఉన్నాయి.
అమ్మాయిల్ని సైకో కిల్లర్ తీసుకెళ్లి హింసించే తీరును భయానకంగా చూపించి.. ఆ తర్వాత ఆ కిల్లర్‌ను ఫ్రేమ్ చేయడం.. అతడికి, ఆమెకు మధ్య ఎత్తులు పైఎత్తులు సాగడాన్ని ఆసక్తికరంగా టీజర్లో ప్రెజెంట్ చేశారు. విజువల్స్.. ఎడిటింగ్.. మ్యూజిక్.. అన్నీ కూడా టాప్ నాచ్ అనిపిస్తున్నాయి. ఇంతకుముందు సిద్దార్థ్ హీరోగా ‘అవల్’ (తెలుగులో గృహం) చిత్రంతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మిలింద్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ‘అవల్’ సంగీత దర్శకుడే అయిన గిరీష్ గోపాలకృష్ణన్ అదిరిపోయే స్కోర్ ఇచ్చాడని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.
నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించడమే కాక అన్ని పాటలూ తనే రాశాడు. నయన్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్టే ఉన్న నేపథ్యంలో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశముంది. ఆమె స్థాయి సూపర్ స్టార్ అంధురాలిగా నటిస్తూ.. సైకో కిల్లర్ పని పట్టడం అనే పాయింట్ ఆసక్తి రేకెత్తించేదే. థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on November 18, 2020 1:29 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…