Movie News

కాంతారని తక్కువ అంచనా వేయొద్దు

రకరకాల అవాంతరాలు, అడ్డంకులు, యూనిట్ సభ్యుల హఠాన్మరణాలతో ఉక్కిరిబిక్కిరి అయిన కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 షూటింగ్ అయిపోయింది. ఈ మేరకు అధికారిక మేకింగ్ వీడియోతో హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి దీన్ని ప్రకటించేశారు. ఏమైనా వాయిదా పడుతుందేమోననే ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేశారు. హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ మేకింగ్ వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం. గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న గ్యారెంటీని రెండు నిమిషాల వీడియోలోని ప్రతి ఫ్రేమ్ లో ఇచ్చారు.

ఇందులో కంటెంట్ సంగతి పక్కనపెడితే కాంతార పోటీని తక్కువంచనా వేసిన ఎవరైనా ఇప్పుడు ఆలోచించుకోక తప్పదనేలా ఉంది. పేరుకి డబ్బింగ్ లా కనిపిస్తున్నప్పటికీ తెలుగులోనూ కాంతారకి కెజిఎఫ్ రేంజ్ లో సీక్వెల్ హైప్ ఉంది. ఎందుకంటే మొదటి భాగం ఎలాంటి అంచనాలు లేకుండా రెండు వారాలు ఆలస్యంగా రిలీజైనా నలభై కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చింది. దీంతో ఈసారి అంతకు మించి వసూలు చేస్తుందనే ధీమా బిజినెస్ వర్గాల్లో ఉంది. అక్టోబర్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న కాంతార ఏ లెజెండ్ చాప్టర్ మీద అన్ని భాషలు కలిపి రెండు వందల కోట్లకు పైగానే బిజినెస్ జరిగేలా ఉంది.

ఇక పోటీ విషయానికి వస్తే అక్టోబర్ 1 ధనుష్ ఇడ్లి కడాయ్ వస్తుంది. దానికన్నా వారం ముందు పవన్ కళ్యాణ్ ఓజి, బాలకృష్ణ అఖండ 2లో ఉన్నాయి కనక వెంటనే వారం గ్యాప్ లో కొత్త సినిమాలు రిలీజ్ చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలు సాహసించడం లేదు. సో కాంతారకు ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. ఏపీ తెలంగాణలో హోంబాలేకి బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, సపోర్ట్ ఉంది. ఒకవేళ ఓజి, అఖండ 2 క్లాష్ అయినా తగినన్ని స్క్రీన్లు దక్కించుకోవడంతో మద్దతు దొరుకుతుంది. టాక్ కనక బాగా వస్తే మాత్రం రిషబ్ శెట్టి చేయబోయే భీభత్సం ఓ రేంజ్ లో ఉంటుంది. మేకింగ్ వీడియోలో అది కనిపిస్తోంది కూడా.

This post was last modified on July 21, 2025 11:08 am

Share

Recent Posts

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

48 minutes ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

2 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

3 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

3 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

3 hours ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

4 hours ago