తొలి సినిమా ఫట్టయితే హీరో హీరోయిన్ల కెరీర్లు ముందుకు సాగడం కొంచెం కష్టమవుతుంది. కానీ కొన్ని సినిమాలు ఫెయిలైనా.. అందులో ఆర్టిస్టులకు పేరొచ్చి అవకాశాలు వరుస కడుతుంటాయి. ఇలాంటి అదృష్టమే దక్కింది శ్రీలీలకు. కన్నడనాట పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి.. ‘పెళ్ళిసందడి’ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా నిరాశపరిచినా.. శ్రీలీల తన అందం, డ్యాన్సులతో యువతను ఆకట్టుకోవడంతో అవకాశాలకు లోటు లేకపోయింది. చూస్తుండగానే స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఐతే ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో శ్రీలీల గ్లామరస్‌గా కనిపించింది కానీ.. హద్దులు దాటేమీ అందాలు ఆరబోయలేదు. క్యూట్‌గా అనిపించే శ్రీలీల లాంటి వాళ్లు అతిగా ఎక్స్‌పోజింగ్ చేసినా, బోల్డ్ సీన్లలో నటించినా అంత బాగుండదు అనే అభిప్రాయం ఉంది. కానీ తన కొత్త చిత్రంలో మాత్రం శ్రీలీల బోర్డర్ దాటేసిందని తన ఫ్యాన్స్ ఫీలయిపోతున్నారు. కర్ణాటక రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయం అయిన ‘జూనియర్’లో శ్రీలీల కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. శ్రీలీల ఇప్పుడున్న రేంజికి ఒక కొత్త హీరో సినిమాలో కథానాయికగా నటించడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే భారీ పారితోషకం ఇచ్చి ఆమెను సినిమాకు ఒప్పించారు.
కానీ ఈ సినిమాలో శ్రీలీలది మరీ మొక్కుబడిగా సాగే పాత్ర. కేవలం పాటల కోసం మాత్రమే ఆ క్యారెక్టర్ ఉపయోగపడింది. ఇది ఆమె ఫ్యాన్స్‌కు రుచించలేదు. పైగా ‘వైరల్ వయ్యారి’ పాటలో శ్రీలీల అప్పీయరెన్స్, హీరో ఆమెతో హద్దులు దాటి చేసిన రొమాన్స్ పట్ల సోషల్ మీడియాలో ఆమె అభిమానుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాటలోని కొన్ని షాట్స్‌ను కట్ చేసి షేర్ చేస్తూ.. ఇలాంటి వాటికి శ్రీలీల ఎలా ఒప్పుకుందంటూ ప్రశ్నిస్తున్నారు. ఎంత ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినా ఒక కొత్త హీరోతో ఇలాంటి షాట్స్ శ్రీలీల ఎలా చేసిందని అడుగుతున్నారు. ఇకపై శ్రీలీల ఫ్యానిజం మానేస్తాం అంటూ చాలామంది పోస్టులు పెడుతుండడం గమనార్హం.
This post was last modified on July 20, 2025 3:57 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…