Movie News

బాలీవుడ్ సూపర్ స్టార్లకు బిగ్ షాక్

ఆమిర్ ఖాన్.. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు. లగాన్, రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన హీరో అతను. కానీ తన చివరి రెండు చిత్రాలకు వచ్చిన ఓపెనింగ్స్ నామమాత్రం. ‘లాల్ సింగ్ చడ్డా’కు తొలి రోజు ఆక్యుపెన్సీలు లేక షోలు క్యాన్సిల్ చేసిన పరిస్థితి. ఆయన కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ కూడా ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. ఇక సల్మాన్ ఖాన్ పరిస్థితి చాలా ఏళ్ల నుంచి ఘోరంగా ఉంది. క్రమంగా ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ పడిపోతున్నాయి. తన చివరి చిత్రం ‘సికందర్’ దారుణ పరాభవాన్ని చవిచూసింది. 

షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకి’ సినిమాలతో పుంజుకున్నాడు కానీ.. అంతకుముందు చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. తర్వాతి సినిమా సంగతేంటో చూడాలి. అక్షయ్ కుమార్ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. ఇలాంటి టాప్ స్టార్ల సినిమాలకు హైప్ క్రియేట్ కావడం, ఓపెనింగ్స్ రావడం గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త హీరో హీరోయిన్లు నటించిన ‘సైయారా’ అనే చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర రేపుతున్న సంచలనం చూసి ట్రేడ్ పండిట్లు షాకవుతున్నారు. 

మంచి ప్రోమోలు, పాటలతో రిలీజ్ ముంగిట ఎవ్వరూ ఊహించని స్థాయిలో హైప్ తెచ్చుకున్న ఈ సినిమాకు తొలి రోజు వసూళ్లు అదిరిపోయాయి. శుక్రవారం రూ.21 కోట్ల నెట్ వసూళ్లతో అదరగొట్టింది ఈ సినిమా. కొవిడ్ తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన చిత్రాల్లో డే-1 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇది మూడో స్థానంలో నిలవడం విశేషం. రెండో రోజు ఈ చిత్రానికి వసూళ్లు ఇంకా పెరిగాయి. శనివారం రూ.25 కోట్లు కొల్లగొట్టిందీ ప్రేమకథా చిత్రం. కొవిడ్ తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన చిత్రాల్లో డే-1 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇది మూడో స్థానంలో నిలవడం విశేషం. 

టాక్ అదిరిపోవడంతో ఆదివారం ఈ సినిమా ప్యాక్డ్ హౌస్‌లతో నడవడం ఖాయంగా కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుమీదున్నాయి. వీకెండ్లో ‘సైయారా’ రూ.75 కోట్ల మేర వసూళ్లు రాబట్టేలా ఉంది. వంద కోట్ల మార్కును అందుకోవడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. రెండో వీకెండ్ అయ్యేసరికి రూ.200 కోట్ల మార్కును దాటడం లాంఛనమే. తర్వాతి వారాల్లో సరైన సినిమాలు పడకపోతే రూ.300 కోట్ల మైలురాయిని కూడా అందుకునే అవకాశముంది. ఓవైపు బాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాలకు ఓపెనింగ్స్ గగనం అయిపోతున్నాయి. లాంగ్ రన్ ఉండట్లేదు. ఇలాంటి సమయంలో స్టార్లు లేని ఒక లవ్ స్టోరీ ఇలాంటి వసూళ్లు రాబట్టడం అనూహ్యమే.

This post was last modified on July 20, 2025 3:31 pm

Share

Recent Posts

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

16 minutes ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

57 minutes ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

1 hour ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

2 hours ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

2 hours ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

2 hours ago