Movie News

మెగా లీక్స్… టీం సీరియస్

ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. షూటింగ్ స్పాట్లో ఎన్ని షరతులు విధించినా.. లీక్స్ సర్వ సాధారణం అయిపోతున్నాయి. ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య షూటింగ్ చేసే రాజమౌళి అండ్ కో కూడా మహేష్ బాబు సినిమా నుంచి లీక్స్‌ను ఆపలేకపోయింది. ప్రతి ఒక్కరి చేతుల్లో కెమెరా ఫోన్లు ఉంటాయి కాబట్టి.. షూటింగ్ స్పాట్‌కు దగ్గర్లో లేని వాళ్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా నుంచి ఇలాగే ఒక వీడియో బయటికి వచ్చేసింది. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. అక్కడ బ్యాక్ వాటర్స్‌లో సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఎవరో మొబైల్లో రికార్డ్ చేసేశారు. నయనతారను ఒక చోటి నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి చేయి పట్టి తీసుకెళ్లడం.. తర్వాత బోట్‌లో చిరు, నయన్ మీద సన్నివేశాలు చిత్రీకరిస్తుండడం ఈ వీడియోలో కనిపిస్తోంది. చిరు, నయన్ ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. చిరు పంచెకట్టులో చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. 

ఇది ఒక సన్నివేశమా.. పాటలో భాగమా అన్నది తెలియదు. కేరళ వాళ్లకు చిరు ఎవరో తెలియకుండా ఉండదు. నయనతార అక్కడమ్మాయే కాబట్టి ఆమె కనిపించగానే ఆసక్తితో వీడియో తీసేసినట్లున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిర్మాణ సంస్థ అలెర్ట్ అయింది. ఇలా వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం నేరమని.. న్యాయపరంగా చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. అభిమానులకు ఇలాంటి వీడియోలు కనిపిస్తే రిపోర్ట్ చేయాలని.. ఎగ్జైట్మెంట్‌‌తో వీటిని షేర్ చేయొద్దని విన్నవించింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో చిరు డ్రిల్ మాస్టర్ పాత్ర పోషిస్తున్నారట. ఈ చిత్రానికి ‘మన వరప్రసాద్ గారు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

This post was last modified on July 19, 2025 9:45 pm

Share
Show comments
Published by
Kumar
Tags: mega 157

Recent Posts

అర్ధరాత్రి మాట కోసం ‘అఖండ 2’ సిద్ధం

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…

17 minutes ago

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

4 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

7 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

8 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

9 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

10 hours ago