కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకు కాల దోషం ఉండదు. ఎన్ని దశాబ్దాలు గడిచినా, తరాలు మారినా వాటి ప్రభావం పెరుగుతుంది తప్ప తగ్గదు. వాటిలో వెంకటేష్ ‘రాజా’ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడో 27 సంవత్సరాల క్రితం 1999లో రిలీజైన ఈ మూవీ ఇప్పటిదాకా ఎన్నిసార్లు శాటిలైట్ ఛానల్స్ లో టెలికాస్టయ్యిందో లెక్క చెప్పడం కష్టం. ఇటీవలే మరోసారి ప్రసారం చేసినప్పుడు వచ్చిన టిఆర్పి రేటింగ్స్ చూసి తలలు పండిన విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. అర్బన్, రూరల్ కలిపి ఏకంగా 5.5 నమోదు చేసింది. ఇటీవలే వచ్చిన ఒక స్టార్ హీరో వరల్డ్ ప్రీమియర్ కు ఇంత రేటింగ్ రాకపోవడం గమనించాల్సిన విషయం.
అంతగా రాజాలో ఏముందంటే కారణాలు వంద చెప్పొచ్చు కానీ సింపుల్ గా ఒక క్లీన్ ఎంటర్ టైనర్ కి ప్రజల్లో దక్కిన స్థానమని చెప్పొచ్చు. తమిళ సూపర్ హిట్ ‘ఉన్నడతిల్ ఎన్నై కొడుతేన్’ రీమేక్ గా రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాలో వెంకటేష్, సౌందర్య జంట ఆడియన్స్ మనసులను నేరుగా తాకింది. ఒక దొంగ ఆటో డ్రైవర్ గా మారి, అందరూ ఉన్నా అనాథగా మిగిలిన ఒక అమ్మాయిని గొప్ప స్థాయికి చేర్చే కథను దర్శకుడు ముప్పలనేని శివ తెరకెక్కించిన విధానం సిల్వర్ జూబ్లీ ఆడించింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు చేసుకున్న మార్పులు గొప్పగా కుదిరాయి. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఓటిటి జమానాలో శాటిలైట్ ఛానల్స్ లో సినిమాలు చూసేవాళ్ళు బాగా తగ్గిపోయారు. ఒకప్పుడు 29 దాకా వచ్చిన రేటింగ్స్ ఇప్పుడు 10 కూడా అందుకోవడం లేదు. యాడ్స్ లేకుండా నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, హాట్ స్టార్ లాంటి ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు చూడటం అలవాటయ్యాక టీవీ ఛానల్స్ పెట్టేవాళ్ళు తగ్గిపోయారు. అలాంటిది రెండున్నర దశాబ్దాల వెనుకటి మూవీకి ఇంత ఆదరణ దక్కడం విశేషమే. అన్నట్టు ఈ రాజా ఉచితంగా యూట్యూబ్ లో కూడా ఉంది.అయినా సరే 5.5 రేటింగ్ అంటే సగటు మధ్య తరగతి ఇళ్లలో ఈ సినిమా ఎంతగా చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. రీరిలీజ్ చేస్తే బెటరేమో.
This post was last modified on July 19, 2025 12:11 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…