Movie News

వార్ 2 ప్రచారంలో అసలైన ఘట్టం

కూలీతో విపరీతమైన పోటీ ఎదురుకుంటున్న వార్ 2 ప్రచారంలో అసలైన ఘట్టం రానుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ బృందం ట్రైలర్ ని సిద్ధం చేసింది. ముంబై రిపోర్ట్స్ ప్రకారం 2 నిమిషాల 39 సెకండ్ల హై వోల్టేజ్ వీడియో కంటెంట్ తో యు/ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంది. యాక్షన్ విజువల్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయని, రక్తపాతం ఓ రేంజ్ లో ఉందని యష్ రాజ్ బృందం నుంచి వినిపిస్తున్న మాట. వచ్చే నెల మొదటి వారం లాంఛ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూలీ ట్రైలర్ ఆగస్ట్ 2 వస్తున్న నేపథ్యంలో దానికన్నా ముందా లేక తర్వాత వదలాలా అనే దాని గురించి తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా యష్ రాజ్ ఫిలింస్ తాజాగా విడుదల చేసిన సయారా ఆశించిన దాని కన్నా పెద్ద ఎత్తున స్పందన దక్కించుకుంటున్న నేపథ్యంలో దాంతో పాటు వార్ 2 ట్రైలర్ ని స్క్రీనింగ్ చేసి ఉంటే బాగుండేదని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. టీజర్ కు నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది కాబట్టి దాన్ని ప్లే చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడుతున్నారు. పోనీ హరిహర వీరమల్లుతో అటాచ్ చేసే అవకాశాన్ని పరిశీలించమని కోరుతున్నారు. బిజినెస్ డీల్స్ మరింత పెరిగేందుకు ట్రైలర్ పోషించే పాత్ర కీలకం. డిస్ట్రిబ్యూటర్లను లాక్ చేసినా ఇంకా ఏరియాల వారిగా అమ్మకాలు పూర్తవ్వలేదు.

ముందైతే ట్రైలర్ కు సంబంధించిన ప్రోమో వచ్చే వారం వదులుతారు. పూర్తి స్థాయి ప్రమోషన్లు ఎప్పటి నుంచి మొదలు పెడతారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ముంబై, హైదరాబాద్, కోచి, చెన్నై, బెంగళూరు నగరాల్లో ప్రెస్ మీట్లు ప్లాన్ చేస్తున్నారు. రెండు చోట్ల పూర్తి స్థాయి వేడుకలు ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి కాకుండా విడివిడిగా వీటిలో పాల్గొనేలా నిర్మాత ఆదిత్య చోప్రా వెరైటీ స్ట్రాటజీ ప్లాన్ చేశారనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన వార్ 2 లో తారక్, హృతిక్ మధ్య ఫేస్ ఆఫ్ మీదే ఎక్కువ అంచనాలున్నాయి.

This post was last modified on July 18, 2025 5:32 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 minutes ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

31 minutes ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

39 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

3 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago