Movie News

ఓటీటీ ప్రేక్షకులకు పండగే..

గత కొన్ని వారాలుగా థియేటర్లలోకి వస్తున్న ఇండియన్ సినిమాలు అంతగా ఆదరణకు నోచుకోవడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. హాలీవుడ్ సినిమాలు ఎఫ్-1, జురాసిక్ వరల్డ్ రీబర్త్, సూపర్ మ్యాన్‌‌లకే మన ప్రేక్షకులు పట్టం కడుతూ వచ్చారు. ఈ వారం రిలీజైన ‘జూనియర్’ చిత్రానికి ఓ మోస్తరు బజ్ ఉంది. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా పెద్దగా సౌండ్ చేయట్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం కష్టంగానే ఉంది. అందులోనూ ఈ వీకెండ్లో వాళ్లను కట్టి పడేసే క్రేజీ కంటెంట్‌ను అందిస్తున్నాయి ఓటీటీలు.

ఈ వీకెండ్లో తెలుగు ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేసే సినిమాలు ఉన్నాయి. గత నెలలో విడుదలై ఘనవిజయం సాధించిన ‘కుబేర’ సినిమా ప్రైమ్‌లో గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి క్రేజీ తారలు నటించిన సినిమా ఇది. శేఖర్ కమ్ముల సినిమాలంటే ఓటీటీల్లో బాగా చూస్తారు. ఈ చిత్రం తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది.

మరోవైపు జీ5లో ‘భైరవం’ సినిమా కూడా నిన్న రాత్రే రిలీజైంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రానికి కాస్టింగ్ వల్ల ఓటీటీలో మంచి ఆదరణ దక్కొచ్చు. హిందీ ఆడియన్సుని అలరించడానికి సంజయ్ దత్ హార్రర్ మూవీ ‘భూత్ని’ కూడా రెడీ అయింది. ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది. ఇక కామెడీ ఎంటర్టైనర్ ‘హౌస్ ఫుల్ 5’ను అమేజాన్ స్ట్రీమ్ చేస్తోంది. కానీ ప్రస్తుతానికి అద్దె రూపంలోనే సినిమా అందుబాటులో ఉంది. తర్వాత ఫ్రీ స్ట్రీమింగ్‌కు వస్తుంది.

ఇక ఈ వారం అన్ని భాషల ప్రేక్షకులను అలరించే ఒక వెబ్ సిరీస్ రిలీజైంది. అదే.. స్పెషల్ ఆప్స్-2. హాట్ స్టార్‌లో ఇంతకుముందు వచ్చిన స్పెషల్ ఆప్స్ ఘనవిజయం సాధించింది. దానికి కొనసాగింపుగా తీసిన ‘స్పెషల్ ఆప్స్-1.5’ కూడా మంచి అప్లాజ్ తెచ్చుకుంది. కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. కేకే మీనన్, నీరజ్ పాండే జోడీ మరోసారి మ్యాజిక్ చేసి ఉంటుందనే అనుకుంటున్నారు. ఇనిషియల్ టాక్ బాగానే ఉంది. ఈ సిరీస్ బహు భాషల్లో ‘హాట్ స్టార్’ ద్వారా విడుదలైంది.

This post was last modified on July 18, 2025 3:30 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago