Movie News

బాహుబలిని కట్టప్ప చంపకుంటే..?

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? పదేళ్ల కిందట భారతీయ ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేసిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం రెండేళ్లు ఎదురు చూశారు. 2017 ఏప్రిల్ 28 ఆ ప్రశ్నకు జవాబు తెలిసింది. ఈ ప్రశ్నే బాహుబలి-2కు పెద్ద ప్రమోషన్ మెటీరియల్‌గా మారింది. ఐతే ఇప్పుడు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో టీం మళ్లీ ప్రమోషన్లు మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రమోషన్లో ప్రభాస్, రానా దగ్గుబాలి సైతం భాగం అవుతుండడం విశేషం. ‘‘బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే’’.. అంటూ ‘బాహుబలి’ ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్టు పెట్టారు. దానికి రానా బదులిస్తూ.. ‘‘నేను అతణ్ని చంపేసేవాడిని’’ అని పేర్కొన్నాడు. దీనికి తర్వాత ప్రభాస్ సైతం రిప్లై ఇవ్వడం విశేషం. ‘బాహుబలి-2’ వెయ్యి కోట్ల పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘‘దీని కోసం అలా జరగనిచ్చేవాడిని భల్లా’’ అని ప్రభాస్ పేర్కొన్నాడు. ఈ కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బాహుబలి’ రీ రిలీజ్‌కు సైతం ఈ రేంజిలో ప్రమోషన్లు చేయడం చూస్తుంటే.. ఇది మళ్లీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

‘బాహుబలి’ రెండు భాగాల నిడివి ఐదున్నర గంటలకు పైగానే కాగా.. ఇప్పుడు దాన్ని మూడున్నర, నాలుగు గంటల మధ్య నిడివితో ఒకటిగా రిలీజ్ చేయబోతున్నారు. రెండు భాగాల నుంచి ఎడిట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఇప్పుడు రీ రిలీజ్‌లో చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవి కూడా తోడవుతున్నాయంటే.. రెండు భాగాల నుంచి చాలా సీన్లతో పాటు పాటలు లేపేయాల్సి ఉంటుంది. ఈ ఎడిటింగ్ పనులను రాజమౌళి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. అక్టోబరులో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. దానికి ముందు ట్రైలర్ కూడా ఒకటి వదలబోతున్నారు.

This post was last modified on July 17, 2025 10:35 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

30 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago